Pawan Vs Mahesh: పవన్ Vs మహేష్.. పోటీ ఉందా లేదా?

తెలుగు సినిమా పరిశ్రమలో సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదలవుతుంటాయి. పెద్ద పండుగ కావడం, ఈ సమయంలో విడుదలైన సినిమాలకు మంచి వసూళ్లు రాబడుతుండటంతో నిర్మాతలు ఈ సమయంలో పెద్ద సినిమాలు విడుదల చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇక వచ్చే సంక్రాంతికి కూడా రెండు పెద్ద సినిమాలు రిలీజ్ డేట్స్ ప్రకటిచాయి

Pawan Vs Mahesh: పవన్ Vs మహేష్.. పోటీ ఉందా లేదా?

Pawan Vs Mahesh

తెలుగు సినిమా పరిశ్రమలో సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదలవుతుంటాయి. పెద్ద పండుగ కావడం, ఈ సమయంలో విడుదలైన సినిమాలకు మంచి వసూళ్లు రాబడుతుండటంతో నిర్మాతలు ఈ సమయంలో పెద్ద సినిమాలు విడుదల చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇక వచ్చే సంక్రాంతికి కూడా రెండు పెద్ద సినిమాలు రిలీజ్ డేట్స్ ప్రకటిచాయి.

వీటిలో ఒకటి మహేష్ బాబు సర్కారువారి పాట కాగా, మరొకటి పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు. ఈ రెండు సినిమాలు ఈ సారి సంక్రాంతికి ఓ రేంజ్ లో పోటీ పడతాయని అంతా భావిస్తున్నారు. ఈ ఇద్దరు టాప్ హీరోల సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుందని అందరు అనుకుంటున్నారు. ఈ తరుణంలోనే లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ అప్డేట్ ప్రకారం, మహేష్, పవన్ మధ్య బాక్సాఫీస్ వార్ ఉండకపోవచ్చు.

సంక్రాంతి రేసులో ఉన్న సర్కారువారి పాట షూటింగ్ చాలావరకు పూర్తైంది. చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సన్నివేశాలను ఎంత నెమ్మదిగా తీసుకున్నా.. సంక్రాంతి వరకు సినిమాను పూర్తి చేసి రిలీజ్ కు సిద్ధం చెయ్యవచు. ఎందుకంటే ఇందులో గ్రాఫిక్స్ కానీ, భారీ సెట్స్ కానీ లేవు. ఇక హరిహర వీరమల్లు విషయానికి ఇటు గ్రాఫిక్స్, అటు సెట్స్ రెండూ అవసరమే అందుకే ఈ సినిమా చిత్రీకరణకు సమయం పెట్టె అవకాశం ఉంది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత ఏఎం రత్నం చెబుతున్నాడు.

కరోనా సెకెండ్ వేవ్ వల్ల అన్ని పనులు ఆగిపోయాయనని, సినిమా షూటింగ్ పూర్తవ్వడానికి ఇంకా చాలా టైమ్ పట్టేలా ఉందని చెప్పుకొచ్చాడు రత్నం.. కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో షూటింగ్ పూర్తిగా నిలిపివేశారు. ఇక ఇప్పటి వరకు 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మిగతా షూటింగ్ పూర్తి చెయ్యాలంటే నాలుగు నుంచి ఐదు సెట్లు వెయ్యాల్సి ఉంది. కరోనాతో షూటింగ్స్ ఆగిపోయిన ఈ సమయంలో సెట్స్ వెయ్యడం అనేది కొద్దిగా కష్టమైన పనే.

ఇక ఈ సినిమా కంటే ముందు పవన్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చేస్తున్న రీమేక్ మూవీని పవన్ పూర్తిచేయాల్సి ఉంది. రీమేక్ కంప్లీట్ అయితే తప్ప క్రిష్ మూవీ స్టార్ట్ చేయలేని పరిస్థితి. కాబట్టి హరిహర వీరమల్లు సినిమా ఆలస్యమౌతుంది. అనౌన్స్ చేసిన తేదికి ఈ సినిమా రిలీజ్ అవదు.. ఇక వీరిద్దరికి మధ్య బాక్సాఫీస్ వార్ ఉండదని అర్ధమవుతుంది.