Bathini Fish Prasadam: ఈ ఏడాదీ పంపిణీ లేదు.. చేప ప్రసాదం కోసం హైదరాబాద్ రావొద్దు..

మృగశిర కార్తె వచ్చిందంటే ప్రతీయేటా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆస్తమా రోగులతో కిటకిటలాడుతుంది. బత్తిని వంశస్తులు ఆస్తమా రోగులకు చేప ప్రసాదం మందును పంపిణీ చేస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రజలు బత్తిని వంశస్తులు...

Bathini Fish Prasadam: ఈ ఏడాదీ పంపిణీ లేదు.. చేప ప్రసాదం కోసం హైదరాబాద్ రావొద్దు..

Bathini Fish Prasadam: మృగశిర కార్తె వచ్చిందంటే ప్రతీయేటా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆస్తమా రోగులతో కిటకిటలాడుతుంది. బత్తిని వంశస్తులు ఆస్తమా రోగులకు చేప ప్రసాదం మందును పంపిణీ చేస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రజలు బత్తిని వంశస్తులు ఇచ్చే చేప ప్రసాదంకోసం వస్తుంటారు. ప్రభుత్వం అనుమతితో చేప ప్రసాదం పంపిణీ ప్రతీయేటా జరుగుతుంది. గత మూడేండ్లుగా చేప ప్రసాదం పంపిణీ వాయిదా పడుతూ వస్తుంది.

Asthma : ఆస్తమాతో జాగ్రత్త! ఎందుకొస్తుందో తెలుసా?

కరోనా కారణంగా చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తూ వస్తుంది. చేప ప్రసాదం కోసం భారీ సంఖ్యలో ఆస్తమా రోగులు తరలివస్తారు. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుందని గత మూడేండ్లుగా చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తూ వస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఆస్తమా రోగులకు ఈ ఏడాది మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తారని అందరూ భావించారు. కానీ ఈ ఏడాది మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడం లేదని నిర్వాహకుడు బత్తిని గౌరీ శంకర్ తెలిపారు.

Asthma : ఆస్తమాతో బాధపడేవారికి మేలు చేసే 5యోగాసనాలు ఇవే?…

తమ పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి వరకు ప్రతీ ఏడాది మృగశిర కార్తె సందర్భంగా ప్రభుత్వ సహాయంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వివిధ ప్రాంతాల ఆస్తమా రోగులకు ఉచితంగా చేప ప్రసాదాన్ని అందించామని తెలిపారు. ఈ ఏడాది సైతం కరోనా నిబంధనలు అమల్లో ఉన్న కారణంగా ప్రభుత్వం చే ప్రసాదం పంపిణీకి అనుమతిని తాత్కాలికంగా నిలిపివేసిందని చెప్పారు. ఆస్తమా రోగులు చేప ప్రసాదం కోసం హైదరాబాద్ కు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.