AP-Telangana Boarder: కోవిడ్ రోగులకు నో ఎంట్రీ.. అంబులెన్సులు వెనక్కి!

కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. రోజుకి వేల సంఖ్యలో మహమ్మారి బారిన పడడంతో ఆసుపత్రులలో సౌకర్యాల కొరత తీవ్రంగా మారింది. ఇటు మందులు, ఆక్సిజన్ కొరతతో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి.

AP-Telangana Boarder: కోవిడ్ రోగులకు నో ఎంట్రీ.. అంబులెన్సులు వెనక్కి!

Ap Telangana Boarder

AP-Telangana Boarder: కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. రోజుకి వేల సంఖ్యలో మహమ్మారి బారిన పడడంతో ఆసుపత్రులలో సౌకర్యాల కొరత తీవ్రంగా మారింది. ఇటు మందులు, ఆక్సిజన్ కొరతతో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు తమ రాష్ట్ర ప్రజలకు ప్రాధాన్యత ఇస్తుండగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా ఏపీ నుండి వచ్చే కోవిడ్ రోగులను అనుమతించడం లేదు. రాష్ట్ర సరిహద్దు నుండే కరోనా పేషేంట్లను అధికారులు, పోలీసులు దగ్గరుండి వెనక్కు పంపిస్తున్నారు.

తెలంగాణ పోలీసులు రాష్ట్ర సరిహద్దు విజయవాడ-తెలంగాణ హైవే రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఏపీ నుంచి వస్తున్న కోవిడ్ పేషెంట్లను నిలుపుదల చేసి వెనక్కు వెళ్ళాల్సిందిగా కోరుతున్నారు. కర్నూలు జిల్లా సరిహద్దు వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తమ రాష్ట్రంలోకి అనుమతి లేదని తెలంగాణ పోలీసులు ఆపేయడంతో కర్నూలు చెక్ పోస్ట్ వద్ద అంబులెన్సులు రోడ్డు వెంట బారులు తీరి బాధితులు పడిగాపులు కాస్తున్నారు. తెలంగాణలోని ఆసుపత్రులలో అపాయింట్మెంట్ తీసుకున్న వారికి మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు.

తెలంగాణలో ఆక్సిజన్ కొరత కారణంగా తమ రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వడం లేదని దయచేసి అర్ధం చేసుకొని వెనక్కు వెళ్లాలని పోలీసులు బాధితులను కోరుతున్నారు. అయితే, బాధితులు ఆసుపత్రులతో సంప్రదింపులు చేయడం.. అపాయింట్మెంట్ల కోసం ఎదురుచూపులతో సరిహద్దు వద్దే ఎదురుచూస్తున్నారు. ఫలితంగా ఇరు రాష్ట్రాల సరిహద్దుల వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. అటు వైపు తమిళనాడు, కర్ణాటకలో లాక్ డౌన్ తో సరిహద్దులు మూతపడగా ఇటు తెలంగాణ సరిహద్దులో కూడా రోగులకు అనుమతించకపోవడంతో ఏపీలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.