Divya Kakran: ఢిల్లీ నుంచి ఏ సాయం అందట్లేదన్న క్రీడాకారిణి.. ప్రభుత్వ సమాధానమిదే

కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన ఒక ఢిల్లీ క్రీడాకారిణి.. తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని చెప్పింది. దీనికి వెంటనే ఆప్ ప్రభుత్వం స్పందించింది. ఆమె ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

Divya Kakran: ఢిల్లీ నుంచి ఏ సాయం అందట్లేదన్న క్రీడాకారిణి.. ప్రభుత్వ సమాధానమిదే

Divya Kakran: కామన్వెల్త్ గేమ్స్‌లో ఢిల్లీకి చెందిన దివ్యా కాక్రన్ అనే బాక్సర్ రజత పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. దివ్య పతకం సాధించినందుకు చాలా మంది ఆమెను అభినందించారు. వారిలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఉన్నారు. కేజ్రీవాల్.. సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

Odisha: వృద్ధుడిని స్తంభానికి కట్టేసి.. కొట్టి చంపిన కుటుంబ సభ్యులు

యితే, ఢిల్లీ ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి సాయం అందడం లేదని దివ్య ట్వీట్ చేసింది. ‘‘నేను విజయం సాధించినందుకు మనస్ఫూర్తిగా అభినందించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు. అయితే నాదొక విన్నపం.. నేను ఢిల్లీలోనే 20 ఏళ్లుగా ఉంటూ, ఇక్కడి నుంచే అనేక ఆటల్లో పాల్గొంటున్నా. కానీ, నాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. నగదు రూపంలో లేదా బహుమతి రూపంలో కూడా ఢిల్లీ ప్రభుత్వం నుంచి సహాయం అందలేదు. ఇప్పటికైనా రాష్ట్రం నుంచి ఏమైనా సహాయం అందుతుందా? ఢిల్లీ రెజ్లర్లు ఇతర రాష్ట్రాల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నా సరే వారికి దక్కిన గౌరవమే నాకూ దక్కుతుందని ఆశిస్తున్నా’’ అంటూ ట్వీట్ చేసింది.

Rajasthan: దేవాలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి

ఈ ట్వీట్‌కు ఢిల్లీ ప్రభుత్వం వెంటనే స్పందించింది. ‘‘దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులందరినీ మా ప్రభుత్వం గౌరవిస్తుంది. ప్రస్తుతం దివ్య ఉత్తర ప్రదేశ్ తరఫున ఆడుతోంది. ఒకవేళ ఆమె ఢిల్లీ తరఫున ఆడినా లేదా ఢిల్లీకి చెందిన ప్రభుత్వ స్పోర్ట్స్ స్కీమ్‌లో సభ్యురాలైనా ఆమెకు సహాయం చేసేందుకు సిద్ధం’ అని ప్రకటించింది.