RTI: ‘గల్వాన్’ ఘర్షణల్లో ఎంతమంది చైనా సైనికులు మృతి చెందారు?: ఆర్టీఐ ద్వారా అడిగిన వ్యక్తి
లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో రెండేళ్ళ క్రితం చైనా, భారత్ సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఎంతమంది చైనా సైనికులు మృతి చెందారు/గాయపడ్డారు? అన్న విషయంపై వివరాలు తెలపాలని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా ఓ వ్యక్తి కోరారు. అలాగే, భారత సైనికులు ఎంతమంది మృతి చెందారు? ఎవరైనా అదృశ్యమయ్యారా? అన్న వివరాలు కూడా చెప్పాలని అడిగారు. అయితే, ఆ వివరాలు తెలపడం కుదరదని కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) స్పష్టం చేసింది.

RTI: లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో రెండేళ్ళ క్రితం చైనా, భారత్ సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఎంతమంది చైనా సైనికులు మృతి చెందారు/గాయపడ్డారు? అన్న విషయంపై వివరాలు తెలపాలని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా ఓ వ్యక్తి కోరారు. అలాగే, భారత సైనికులు ఎంతమంది మృతి చెందారు? ఎవరైనా అదృశ్యమయ్యారా? అన్న వివరాలు కూడా చెప్పాలని అడిగారు. అయితే, ఆ వివరాలు తెలపడం కుదరదని కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) స్పష్టం చేసింది. 2020, జూన్ 15 రాత్రి గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. గల్వాన్ లోయలోకి చైనా సైనికులు అక్రమంగా చొచ్చుకునిరాగా, వారి చర్యలను భారత సైనికులు తీవ్రంగా ప్రతిఘటించారు.
ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారని అప్పట్లోనే ఇండియా ప్రకటించింది. అలాగే, చైనా వైపు కూడా ప్రాణనష్టం జరిగింది. అనంతరం భారత్-చైనా మధ్య చర్చలు జరిగి పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. దీనిపైనే అఖండ్ అనే వ్యక్తి ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వివరాలు కోరారు. అయితే, అఖండ్ అడిగిన సమాచారం ఆర్టీఐ చట్టంలోని 8(1)(జే) కింద మినహాయింపు పరిధిలో ఉందని కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ వివరించింది. భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రత, వ్యూహాలు, శాస్త్రీయత, ఆర్థిక ప్రయోజనాలను ప్రభావితం చేసేలా ఉండే సమాచారాన్ని ఇవ్వలేమని తెలిపింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యానూ ఆయా వివరాలు ఇవ్వలేమని పేర్కొంది.
Hyderabad Heavy Rain : హైదరాబాద్‌ను వెంటాడుతున్న వరుణుడు.. మళ్లీ భారీ వర్షం