Telangana: లాక్​డౌన్ ఉండదా.. కర్ఫ్యూ మాత్రమే కొనసాగిస్తారా?

తెలంగాణలో రేపటితో లాక్ డౌన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం అత్యవసర భేటీ కానుంది. లాక్ డౌన్ ఆంక్షలు, సడలింపులపై రేపు జరగబోయే క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

Telangana: లాక్​డౌన్ ఉండదా.. కర్ఫ్యూ మాత్రమే కొనసాగిస్తారా?

Telangana

Telangana: తెలంగాణలో రేపటితో లాక్ డౌన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం అత్యవసర భేటీ కానుంది. లాక్ డౌన్ ఆంక్షలు, సడలింపులపై రేపు జరగబోయే క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే.. కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ మొదలైన దగ్గరి నుండి ఇప్పటి వరకు ప్రతిసారి సడలింపులు పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఇప్పుడు రాష్ట్రంలో కేసులు కూడా చాలా స్వల్పంగానే నమోదవుతున్నాయి.

ఈక్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది ఉత్కంఠగా మారింది. కరోనా కేసుల ఉద్ధృతి తగ్గుతున్న పరిస్థితుల్లో లాక్​డౌన్ ఇక ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోండగా.. రాత్రి కర్ఫ్యూ మాత్రం కొనసాగే అవకాశాలున్నాయి. రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగించే అవకాశం ఉండగా జనసమ్మర్థ ప్రదేశాలు, మార్కెట్లు, దుకాణాలు వద్ద కొవిడ్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేసే అవకాశం కనిపిస్తోంది.

రేపు సాయంత్రం ఐదు గంటలతో మినహాయింపులకు ఇచ్చిన గడువు పూర్తవుతుండగా.. లాక్​డౌన్ పూర్తవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నది తేలాల్సి ఉంది. ఇక రేపు జరగబోయే క్యాబినెట్ భేటీలోనే సీజనల్ వ్యాధులు, వర్షపాతం, వానాకాలం సాగు, గోదావరిలో నీటి ఎత్తిపోత, జల విద్యుత్ ఉత్పత్తిపై కూడా చర్చ జరుగనుంది.