కరోనా ఎఫెక్ట్, మే 31 వరకు మెట్రో బంద్

కరోనా తీవ్రత తగ్గకపోవడంతో కేంద్రం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరోసారి

  • Published By: naveen ,Published On : May 18, 2020 / 01:55 AM IST
కరోనా ఎఫెక్ట్, మే 31 వరకు మెట్రో బంద్

కరోనా తీవ్రత తగ్గకపోవడంతో కేంద్రం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరోసారి

కరోనా తీవ్రత తగ్గకపోవడంతో కేంద్రం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించింది. మే 18 నుంచి లాక్ డౌన్ 4 అమల్లోకి వచ్చింది. మే 31వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ఆదివారం(మే 17,2020) కేంద్రం ప్రకటన చేసింది. మరో 14 రోజుల పాటు దేశమంతా లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా.. దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ లాక్‌డౌన్ పొడిగించడం ఇది నాలుగోసారి. ప్రధాని నరేంద్ర మోడీ విధించిన లాక్‌డౌన్ 3వ దేశ ఆదివారంతో ముగిసింది. దీంతో మరో 14 రోజులు అంటే.. ఈ నెల 31వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగించింది కేంద్రం. 

కరోనా తీవ్రత కారణంగా లాక్ డౌన్ పొడిగింపు:
కాగా కేంద్రం నుంచి ప్రకటన రాకముందే తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ను మే 31వ తేదీ వరకు పొడిగించాయి. దేశ వ్యాప్తంగా కరోనా మరింతగా విజృంభించడంతో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. కాగా, నాలుగో దశ లాక్ డౌన్ లో కేంద్రం భారీ సడలింపులు ప్రకటించింది. రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇచ్చింది. ఇకపోతే మే 31వ తేదీ వరకు నిలిపివేసిన వాటిలో మెట్రో రైలు సేవలు కూడా ఉన్నాయి.

కరోనా విస్తరించే అవకాశంతో మెట్రోరైలు సర్వీసులు నిలిపివేత:
లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ నెల 31వ తేదీ వరకు మెట్రో రైల్‌ సేవలు నిలిపివేశారు. దేశంలోని మెట్రో సర్వీసులన్నింటినీ అప్పటి వరకు తెరవొద్దని కేంద్రం ప్రకటించడంతో హైదరాబాద్‌ మెట్రో సేవలు నిలిచిపోయాయి. ప్రజా రవాణతో కరోనా మరింత విస్తరించే అవకాశం ఉన్నందున మెట్రోరైలు ఆపరేషన్స్‌ను నిలిపివేశారు. లాక్ డౌన్ 4లో సడలింపులు ఇస్తారని, మెట్రో సేవలు ప్రారంభిస్తారని నగర వాసులు ఆశించారు. మెట్రోలో ఆఫీసులకు వెళ్లొచ్చని ఐటీ ఆఫీసుల్లో పని చేసే సిబ్బంది భావించారు. అలాగే బస్సులు తిరక్కపోవడంతో మెట్రో సేవలు ప్రారంభిస్తే వాటిలో ప్రయాణం చేయొచ్చని అనుకున్నారు. కానీ కేంద్రం మెట్రో ఆపరేషన్స్ కి పర్మిషన్ ఇవ్వలేదు. మే 31వ తేదీ వరకు మెట్రో రైలు సేవలు నిలిపివేసింది. కాగా మెట్రో రైలు నడపకున్నా హైదరాబాద్‌లో మెట్రోస్టేషన్లు, కారిడార్‌ ప్రాంతాలను మెట్రో సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. కేంద్రం నుంచి ఎప్పుడు ఆదేశాలు వచ్చినా రైళ్లు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు మెట్రోరైలు అధికారులు చెప్పారు.

* అదే విధంగా ఆర్టీసీ అంతరాష్ట్ర సర్వీసులను ఆయా రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహనతో నిర్ణయం తీసుకునే అవకాశం ఇచ్చిన కేంద్రం. 
* సిటీ బస్సులకు సంబంధించి రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చు.
* బస్‌ డిపోలు, రైల్వే స్టేషన్లలో క్యాంటిన్లు తెరువొద్దని సూచన.

4వ విడత లాక్‌డౌన్‌ నూతన మార్గదర్శకాలు:
* రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7గంటల వరకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ యథావిధిగా కొనసాగింపు
* కంటైన్మెంట్‌, రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లపై నిర్థయాధికారం రాష్ట్రాలకే అప్పగింత.
* కరోనా హాట్‌ స్పాట్స్‌ కేంద్రాల్లో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశం. 
* కంటైన్మెంట్‌ జోన్లలో అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి.
* అంతర్రాష్ట బస్సు సర్వీసులకు షరతులతో కూడిన అనుమతులు మంజూరు.
* 65ఏళ్లు దాటినవారు, గర్బిణిలు, పదేళ్ల లోపు చిన్నారులు ఇళ్లలోనే ఉండాలని కేంద్రం సూచన. 
* కాలేజీలు, స్కూళ్లకు మే 31వరకు అనుమతి లేదు
* సినిమా థియేటర్లు, దేవాలయాలు మూసివేత కొనసాగింపు
* హోటళ్లు, రెస్టారెంట్లపై నిషేధం
* రాజకీయ, సామాజిక సభలపై నిషేధం కొనసాగింపు

* మెట్రో రైళ్లు, విద్యా, శిక్షణ సంస్థలు మే 31 వరకు బంద్‌
* దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులు బంద్‌
* స్విమ్మింగ్‌ పూల్స్‌, జిమ్‌లు, మే 31వరకు బంద్‌
* ఆర్టీసీ బస్సులు, స్థానిక రవాణాపై రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం
* భౌతిక దూరం పాటిస్తూ అంత్యక్రియలకు 20 మందికి, పెళ్లిళ్లకు 50మందికి మాత్రమే అనుమతి
* అన్ని రాష్ట్రాల మధ్య వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది ప్రయాణానికి అనుమతి
* బార్బర్‌ షాపులు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు ఓపెన్‌ చేసేందుకు అనుమతి
* ఆహార పదార్థాలను హోం డెలివరీ చేసేందుకు రెస్టారెంట్లకు అనుమతి 

Read Here>> రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడుస్తాయా?