Afghanistan: మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు: అఫ్ఘనిస్తాన్

మా చుట్టుపక్కల దేశాలకు, ప్రపంచానికి హామీ ఇస్తున్నాం. వేరే దేశాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు మా నేలను వాడుకోవడానికి ఏ దేశానికీ అనుమతించం. ఇతర దేశాలు కూడా మా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని కోరుతున్నాం.

Afghanistan: మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు: అఫ్ఘనిస్తాన్

Afghanistan

Afghanistan: తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని ప్రపంచ దేశాలకు సూచించింది అఫ్ఘనిస్తాన్. ఈద్-ఉల్-అదాను పురస్కరించుకుని అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అధినేత హెబాతుల్లా అకుంద్‌జాదా ఒక ప్రకటన విడుదల చేశారు. తమ దేశానికి సంబంధించిన అంశాలపై వివరించారు.

Booster Dose: బూస్టర్ డోసు కాల పరిమితి తగ్గించిన కేంద్రం.. ఇకపై ఆరు నెలలే!

‘‘మా చుట్టుపక్కల దేశాలకు, ప్రపంచానికి హామీ ఇస్తున్నాం. వేరే దేశాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు మా నేలను వాడుకోవడానికి ఏ దేశానికీ అనుమతించం. ఇతర దేశాలు కూడా మా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని కోరుతున్నాం. మేం అమెరికాతోపాటు ప్రపంచ దేశాలన్నింటితో మంచి రాజకీయ, ఆర్థిక, దౌత్యపరమైన సంబంధాలను కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. అన్ని రంగాల్లో పరస్పర సహకారానికి కట్టుబడి ఉన్నాం’’ అని హెబాతుల్లా ప్రకటించారు. అల్ ఖయిదాతోపాటు పాకిస్తాన్‌కు చెందిన తీవ్రవాద సంస్థలైన జైషే మహమ్మద్, లష్కరే తయిబా వంటి సంస్థలకు అఫ్ఘనిస్తాన్ ఆశ్రయం కల్పిస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో తాలిబన్ల చీఫ్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Make in India: ‘మేకిన్ ఇండియా’ ఫలితం.. 70 శాతం తగ్గిన బొమ్మల దిగుమతులు

గత ఆగష్టులో అఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు వశం చేసుకున్న సమయంలో భారత్, తన దౌత్యవేత్తను తిరిగి ఇండియాకు రప్పించింది. అయితే, ఈమధ్య కాలంలో మళ్లీ ఆ దేశంతో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకుంటోంది. కాబూల్‌లో ఒక దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసి, టెక్నికల్ టీమ్‌ను భారత్ నియమించింది. ఇటీవల భారత ప్రతినిధుల బృందం అఫ్ఘనిస్తాన్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా తమ దేశంలో ఉన్న తీవ్రవాద సంస్థలైన లష్కరే తయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలపై చర్యలు తీసుకుంటామని అఫ్ఘనిస్తాన్‌ హామీ ఇచ్చింది.