Congress: ‘పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో 17 కోట్ల మందికి వేసినా మన్మోహన్ సింగ్ పోస్టర్ వాడలేదు’

కొవిడ్ వ్యాక్సినేషన్ సంఖ్య పెరిగిన మరుసటి రోజే కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పార్టీపై విమర్శలకు దిగింది. పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా 17కోట్ల మందికి వేసినప్పుడు కూడా మన్మోహన్ సింగ్ పోస్టర్ వాడలేదు.

Congress: ‘పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో 17 కోట్ల మందికి వేసినా మన్మోహన్ సింగ్ పోస్టర్ వాడలేదు’

Vaccination

Congress: కొవిడ్ వ్యాక్సినేషన్ సంఖ్య పెరిగిన మరుసటి రోజే కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పార్టీపై విమర్శలకు దిగింది. పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా 17కోట్ల మందికి వేసినప్పుడు కూడా మన్మోహన్ సింగ్ పోస్టర్ వాడలేదు. సోమవారం 80లక్షల మందికి వ్యాక్సిన్ వేయడం చాలా సంతోషం. కానీ, అత్యంత ఎక్కువ సంఖ్యలో 17కోట్ల పోలియో వ్యాక్సినేషన్ డోసులు వేయగలిగాం. అప్పుడు మన్మోహన్ సింగ్ పోస్టర్ ఒక్కటి కూడా లేదు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా అన్నారు.

బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా చేసిన కామెంట్లను తిప్పికొట్టారు. ‘రాహుల్ గాంధీని ఒక్కటే అడుగుతున్నా. కరోనావైరస్ సెకండ్ వేవ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచే మొదలైంది. ఈ వేవ్ కారణంగానే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చాలా ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి’ అని పాత్రా అన్నారు.
.
మంగళవారం ఉదయం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కొవిడ్ మేనేజ్మెంట్ లో ప్రభుత్వ పాత్ర అంటూ ఓ వైట్ పేపర్ చూపించారు. దాంతో పాటు ఇండియాలో థర్డ్ వేవ్ ప్రభావం గతం కంటే ఐదారు రెట్లు ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. సెకండే వేవ్ దారుణంగా అనిపిస్తుంది. అయితే థర్డ్ వేవ్ అంతకుమించి దారుణంగా ఉంటుంది. వ్యాక్సినేషన్ పై దృష్టి పెట్టండి. వైరస్ రీ జనరేట్ అవడానికి తావివ్వకండి అని పిలుపునిచ్చారు రాహుల్.

సోమవారం 80లక్షల మందికి కొవిడ్-19వ్యాక్సినేషన్ చేయగలిగామని, ఒక్కరోజులో ఇంత పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్లు వేయడం ఇదేనంటూ.. అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా వెల్ డన్ ఇండియా అంటూ పోస్టు పెట్టారు.