New Movie Openings: నో రిలాక్స్.. స్టార్ హీరోల కొత్త సినిమాలు మొదలు!

ఒక్క సినిమా సందడి కంప్లీట్ కాకముందే మరో సినిమా ధియటర్లోకి దిగుతోంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రిలీజ్ చెయ్యడమే కాదు.. అసలే మాత్రం రిలాక్స్ అవ్వకుండా కొత్త సినిమాల్ని స్టార్ట్..

New Movie Openings: నో రిలాక్స్.. స్టార్ హీరోల కొత్త సినిమాలు మొదలు!

New Movie Openings

New Movie Openings: ఒక్క సినిమా సందడి కంప్లీట్ కాకముందే మరో సినిమా ధియటర్లోకి దిగుతోంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రిలీజ్ చెయ్యడమే కాదు.. అసలే మాత్రం రిలాక్స్ అవ్వకుండా కొత్త సినిమాల్ని స్టార్ట్ చేస్తున్నారు హీరోలు. విజయ్ దగ్గరుంచి వరుణ్ తేజ్ వరకూ మన హీరోలు అందరూ కొత్త సినిమాలు మొదలు పెట్టేస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి పెండింగ్ పడిపోయిన సినిమాలు వరసగా రిలీజ్ అవుతున్నాయి. హమ్మయ్య రిలీజ్ అయిపోయాయి కదా అని రిలాక్స్ అవ్వకుండా.. కొత్త సినిమాల్ని చకచకా స్టార్ట్ చేసేస్తున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ మోస్ట్ అవెయిటింగ్ మూవీ లైగర్ ఇంకా రిలీజ్ చెయ్యకుండానే కొత్త సినిమాని స్టార్ట్ చేసేశాడు.

Jana Gana Mana: ముహూర్తం పెట్టేసిన పూరీ-రౌడీ.. గ్యాప్ లేకుండా కుమ్ముడే!

రెండేళ్ల క్రితం మొదలైన లైగర్.. ఈసంవత్సరం ఆగస్ట్ 25న ఆడియన్స్ ముందుకొస్తోంది. లైగర్ షూట్ కంప్లీట్ చేసిన రోజే పూరీ జగన్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన కూడా మొదలవ్వబోతోందని అనౌన్స్ చేసిన టీమ్.. మంగళవారం సినిమాని అఫీషియల్ గా మొదలుపెట్టారు. జనగణమన టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా బ్యాక్ టూ బ్యాక్ పూరీ, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న లైగర్ ఇప్పటికే హై ఎక్స్ పెక్టేషన్స్ తో తెరకెక్కింది. రెండో మూవీగా స్టార్ట్ అయిన ఈ జనగణమన ఇప్పటికే చాలా మంది హీరోల్ని దాటుకుని లాస్ట్ కి విజయ్ తో తీస్తున్నారు పూరీజగన్నాధ్.

Suriya: ఒకవైపు స్టోరీ బేస్డ్ సినిమాలు.. మరోవైపు రొట్ట కొట్టుడు.. అస్సలు అర్థం కాడు!

తమిళ్ స్టార్ హీరో సూర్య.. తన 41వ సినిమాని అనౌన్స్ చేశారు. క్రేజీ డైరెక్టర్ బాలతో తన కొత్త సినిమాని కన్యాకుమారిలో మొదలుపెట్టారు సూర్య. సూర్యని సరికొత్తగా చూపించే డెప్త్ ఉన్న స్టోరీతో బాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జ్యోతిక, సూర్య ప్రొడ్యూసర్లుగా చేస్తున్న ఈ మూవీ సూర్య కెరీర్ లో స్పెషల్ గా నిలుస్తుందంటున్నారు ఫాన్స్.

Varun Tej : మరో కొత్త కాన్సెప్ట్‌తో వరుణ్‌తేజ్.. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఎక్కడా తగ్గడం లేదు.. ఎఫ్ 3, గని సినిమాల్ని రిలీజ్ కు రెడీ చేస్తూనే మరో సినిమా మొదలుపెట్టేశారు. తన కెరీర్ లో 12వ సినిమాని ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో స్టార్ట్ చేశారు వరుణ్ తేజ్. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమా ఆల్రెడీ ప్రవీణ్.. నాగార్జునతో చేస్తున్న ఘోస్ట్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసుకుంటుంది.

Sai Dharam Tej: బ్యాక్ టు సెట్స్‌లో ఎమోషనల్ అయిన తేజు

సాయిధరమ్ తేజ్ చాలా గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చారు. తన యాక్సిడెంట్ గురించి ఆడియన్స్ తో షేర్ చేసుకున్న ఈమెగా మేనల్లుడు.. తన కొత్త సినిమా గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. సుకుమార్ ప్రొడక్షన్ లో కొత్త సినిమాని నిన్న స్టార్ట్ చేసిన సాయిధరమ్ తేజ్.. ఆల్రెడీ కార్తీక్ డైరెక్షన్లో మిస్టిక్ ధ్రిల్లర్ సినిమాతో కూడా ఎంగేజ్ అయి ఉన్నాడు.

Naga Chaitanya: ఆ డైరెక్టర్‌తో చైతూ సినిమా..?

అక్కినేని హీరో నాగచైతన్య కూడా తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చెయ్యబోతున్నారు. విక్రమ్ కుమార్ తో థాంక్యూ మూవీతో పాటు వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు నాగచైతన్య. లేటెస్ట్ గా మరో కొత్త సినిమా అనౌన్స్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు చై. మానాడు మూవీ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో సినిమా స్టార్ట్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. అంతేకాదు తెలుగు, తమిళ్ బైలింగ్వల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతన్యకు జంటగా పూజాహెగ్డే స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.