Updated On - 5:40 pm, Wed, 3 March 21
No vaccine హజ్ యాత్రకు వచ్చే వారందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి అని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియా వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని,వ్యాక్సిన్ తీసుకోని వాళ్లను హజ్ కు అనుమతించబోమని సౌదీ అరేబియా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రజా ఆరోగ్య దృష్ట్యా సురక్షితమైన పద్దతిలో హజ్ ని నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మక్కాలోని ముస్లింల పుణ్యక్షేత్రమైన హజ్…ఇస్లాం ఐదు మూలస్థంభాలలో ఐదవది. ప్రతి ఏటా లక్షల సంఖ్యలో ముస్లింలు హజ్ కోసం మక్కాని సందర్శిస్తుంటారు. ప్రతి ముస్లిం తన జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని భావిస్తారు. ప్రతి సంవత్సరం ఇస్లామిక్ నెల ధుల్ హిజ్జాలో ఈ యాత్ర నిర్వహించబడుతుంది. అయితే గతేడాది కరోనా కారణంగా హజ్ వార్సిక యాత్రను సౌదీ అరేబియా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిమిత సంఖ్యలో యాత్రికులను హజ్ కు అనుమతించింది.
మరోవైపు, ఈ ఏడాది హజ్ యాత్రపై భారత మైనార్టీ వ్యవహారాలశాఖ తన వెబ్ సైట్ ద్వారా స్పందించింది. సౌదీ మినిస్ట్రీ ాఫ్ హఝ్ అండ్ ఉమ్రా నుంచి ఆదేశాలు అందుకున్న తర్వాతనేహజ్ 2021యాత్రకు సంబంధించిన ప్రాసెస్ ను ప్రకటిస్తామని పేర్కొంది.
Covid-19 Death Toll : 30లక్షలు దాటేసిన కరోనా మరణాలు
వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గడ్డకట్టిన రక్తం
Central Bank Of India : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి బ్యాంకు అదిరిపోయే ఆఫర్
Mohan Bhagwat : ఆర్ఎస్ఎస్ చీఫ్ కు కరోనా
Corona Vaccine : కరోనా టీకా వేసుకుంటే..బీర్ ఫ్రీ..ఎక్కడో తెలుసా
COVID-19 TG : తెలంగాణలో ఒక్కరోజే 2, 478 కరోనా కేసులు, ఐదుగురు మృతి