Nokia PureBook: నోకియా నుంచి 16జీబీ ర్యామ్‌తో ల్యాప్‌టాప్‌

ఇండియన్ మార్కెట్లో కస్టమర్లకు మరింత దగ్గరయ్యేందుకు రీసెంట్‌గా నోకియా ప్యూర్‌బుక్ ఎస్ 14 ల్యాప్‌టాప్, కొత్త నోకియా స్మార్ట్ టీవీ సిరీస్‌ మోడళ్లను లాంచ్ చేసింది.

Nokia PureBook: నోకియా నుంచి 16జీబీ ర్యామ్‌తో ల్యాప్‌టాప్‌

Nokia Laptop

Nokia PureBook: ఇండియన్ మార్కెట్లో నోకియా బ్రాండ్‌కు ఉన్న నమ్మకం వేరు. స్టాండర్డ్ ప్రొడక్ట్‌గా పేరు సంపాదించుకున్న నోకియా.. కస్టమర్లకు మరింత దగ్గరయ్యేందుకు రీసెంట్‌గా నోకియా ప్యూర్‌బుక్ ఎస్ 14 ల్యాప్‌టాప్, కొత్త నోకియా స్మార్ట్ టీవీ సిరీస్‌ మోడళ్లను లాంచ్ చేసింది. ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్ పార్టనర్‌షిప్‌తో మంగళవారం లాంచింగ్ చేసింది. అక్టోబర్ 3 నుంచి ఈ ఎలక్ట్రానిక్స్‌ ప్రొడక్ట్స్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి.

విండోస్ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే నోకియా ప్యూర్‌బుక్ ఎస్ 14 ఈ ల్యాప్‌టాప్‌లో 11 జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. నోకియా స్మార్ట్ టీవీ మోడల్స్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ సహాయంతో పనిచేస్తాయి. ఇవి 50, 55 అంగుళాల డిస్‌ప్లే పరిమాణాలలో రిలీజ్‌ చేసింది. ఈ స్మార్ట్‌టీవీలు ఫుల్‌ హెచ్‌డీ, అల్ట్రా హెచ్‌డీ, క్యూఎల్‌ఈడీ వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి.

ధర ఏంతంటే…?
నోకియా ప్యూర్‌బుక్ ఎస్14 ల్యాప్‌టాప్ ధర రూ.56వేల 990.
నోకియా 50అంగుళాల అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్‌టీవీ ధర రూ. 44వేల 999. అల్ట్రా హెచ్‌డీ 4కే క్యూఎల్‌ఈడీ ధర రూ. 49వేల 999గా నోకియా నిర్ణయించింది.
నోకియా 55ఇంచ్‌ అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్‌టీవీ ధర రూ. 49వేల 999. అల్ట్రా హెచ్‌డీ 4కే క్యూఎల్‌ఈడీ ధర రూ. 54వేల 999గా నోకియా నిర్ణయించింది.
ఈ స్మార్ట్ టీవీ సెట్లు జేబీఎల్‌ స్పీకర్స్‌తో పనిచేస్తుండగా.. 2జీబీ ర్యామ్‌ + 16జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో అందుబాటులోకి రానున్నాయి.

…………………………………..: అమెరికా 250 ఏళ్ల చరిత్రలో మొదటిసారి..సిక్కు మెరైన్‌కు తలపాగా ధరించే అవకాశం..

నోకియా ప్యూర్‌బుక్ ఎస్ 14 స్పెసిఫికేషన్స్
* విండోస్ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
* బరువు 1.4 కిలోలు
* 11 జెన్ ఇంటెల్ కోర్ i5 CPU
* డాల్బీ అట్మోస్ సపోర్ట్
* 14-అంగుళాల ఫుల్-హెచ్‌డి ఐపిఎస్ డిస్‌ప్లే
* 16జీబీ ర్యామ్‌ + 512జీబీ NVMe ఎస్‌ఎస్‌డీ
* యూఎస్‌బీ టైప్-సి, హెచ్‌డీఎమ్‌ఐ పోర్టులు