North Korea: నార్త్‌ కొరియాలో కరోనా విలయం.. కషాయాలు, టీలు తాగండి అంటూ సలహా

ఉత్తర కొరియాలో కరోనా విజృంభిస్తోంది. కోవిడ్‌ కేసులు అధిక సంఖ్యలో నమోదు కావడంతో అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కరోనా వైరస్‌ వస్తే పౌరుల్ని చంపేందుకు కూడా వెనుకాడబోనని గతంలో చెప్పిన ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్‌, ప్రస్తుతం కరోనా నివారణ చర్యలు చేపట్టాడు.

North Korea: నార్త్‌ కొరియాలో కరోనా విలయం.. కషాయాలు, టీలు తాగండి అంటూ సలహా

North Korea

North Korea: ఉత్తర కొరియాలో కరోనా విజృంభిస్తోంది. కోవిడ్‌ కేసులు అధిక సంఖ్యలో నమోదు కావడంతో అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కరోనా వైరస్‌ వస్తే పౌరుల్ని చంపేందుకు కూడా వెనుకాడబోనని గతంలో చెప్పిన ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్‌, ప్రస్తుతం కరోనా నివారణ చర్యలు చేపట్టాడు.

Supreme Court : సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు: సుప్రీం ఆదేశం

కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో వైద్యాధికారులను అప్రమత్తం చేసి, కరోనా వ్యాప్తి చెందిన ప్రదేశాల్లో టెస్టులు చేయిస్తున్నారు. మరోవైపు కరోనా నుంచి త్వరగా బయటపడేందుకు కషాయాలు తాగండి అంటూ ఉచిత సలహాలు ఇస్తోంది అక్కడి ప్రభుత్వం. ‘‘వైరస్‌ రాకుండా రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు కషాయాలు తాగండి. తేనెతో టీ సేవించండి’’ అంటూ ఉత్తర కొరియా అధికార మీడియాలో ప్రకటనలు చేస్తున్నారు. కోవిడ్‌ను ఎలా ఎదుర్కోవాలో చిట్కాలు చెబుతూ టీవీ, రేడియో, వార్తా ప్రతికల్లో భారీగా ప్రచారం చేస్తున్నారు.

Supreme Court Disha Case : ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ కేసు..విచారణ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం కోర్టు

ఇప్పటివరకు ఉత్తర కొరియాలో కోవిడ్‌ కేసులు మొదలైన వారం రోజుల్లోనే కేసుల సంఖ్య 20లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు వైరస్‌ సోకి 63 మంది చనిపోయారు. దేశ వ్యాప్తంగా 7,40,160 మందికిపైగా క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారని అక్కడి స్థానిక వార్తా సంస్థ తెలిపింది.