North Korea: 8 ఖండాంత‌ర క్షిప‌ణుల‌ను ప‌రీక్షించి మ‌రోసారి క‌ల‌క‌లం రేపిన ఉత్త‌ర‌కొరియా

అమెరికా ఎన్ని ఆంక్ష‌లు విధించినా, అంతర్జాతీయ సమాజం నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నా ఉత్త‌రకొరియా త‌న తీరు మార్చుకోవ‌డం లేదు. జ‌పాన్ సముద్రం వైపుగా ఆదివారం ఉద‌యం ఎనిమిది స్వ‌ల్ప శ్రేణి ఖండాంత‌ర క్షిప‌ణుల‌ను ప‌రీక్షించి మ‌రోసారి క‌ల‌క‌లం రేపింది.

North Korea: 8 ఖండాంత‌ర క్షిప‌ణుల‌ను ప‌రీక్షించి మ‌రోసారి క‌ల‌క‌లం రేపిన ఉత్త‌ర‌కొరియా

Missile

North Korea: అమెరికా ఎన్ని ఆంక్ష‌లు విధించినా, అంతర్జాతీయ సమాజం నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నా ఉత్త‌రకొరియా త‌న తీరు మార్చుకోవ‌డం లేదు. జ‌పాన్ సముద్రం వైపుగా ఆదివారం ఉద‌యం ఎనిమిది స్వ‌ల్ప శ్రేణి ఖండాంత‌ర క్షిప‌ణుల‌ను ప‌రీక్షించి మ‌రోసారి క‌ల‌క‌లం రేపింది. ఈ విష‌యాన్ని ద‌క్షిణ కొరియా మిలిట‌రీ నిర్ధారించింద‌ని అక్క‌డి మీడియా పేర్కొంది. ఉత్త‌ర‌కొరియా భూభాగంలోని రెండు ప్రాంతాల‌ నుంచి జ‌పాన్ సముద్రం వైపుగా వ‌రుస‌గా క్షిప‌ణుల‌ను ప‌రీక్షించింద‌ని తెలిపింది.

Delhi: ఏడేళ్లుగా మూగ‌బోయిన బాలుడి గొంతు.. అరుదైన శస్త్ర‌చికిత్సతో మాట తెప్పించిన వైద్యులు

అంతేగాక‌, మ‌రో ఖండాంత‌ర క్షిప‌ణిని కూడా ఉత్త‌ర‌కొరియా ప‌రీక్షించింద‌ని, అయితే, దానికి సంబంధించిన వివ‌రాలు స్ప‌ష్టంగా తెలియ‌లేద‌ని ద‌క్షిణ కొరియా మిలిట‌రీ తెలిపిన‌ట్లు మీడియా పేర్కొంది. కాగా, కొరియా విష‌యంలో అమెరికా జోక్యాన్ని తాము స‌హించ‌బోమంటోన్న ఉత్త‌ర‌కొరియా చాలా ఏళ్లుగా దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోన్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో గ‌తంలో అమెరికాతో జ‌రిపిన చ‌ర్చ‌లు కూడా స‌ఫ‌లం కాలేదు. ద‌క్షిణ కొరియా, జ‌పాన్ నుంచి ఎన్ని అభ్యంత‌రాలు వ‌స్తున్న‌ప్ప‌టికీ ఉత్త‌రకొరియా ప‌దే ప‌దే క్షిప‌ణుల పరీక్ష‌లు చేప‌డుతోంది.