Jeremy Lalrinnunga: గోల్డ్ మెడల్ కోసం రెండేళ్లుగా ఇంటికే వెళ్లని జెరెమీ

సంవత్సరాల తరబడి కష్టబడిన జెరెమీ లాల్రిన్నుంగా కామన్వెల్త్ అరంగ్రేట సీజన్‌లోనే గోల్డ్ మెడల్ సాధించారు. ఈ 19ఏళ్ల అథ్లెట్ 67కేజీల కేటగిరీలో స్నాచ్ సెషన్ తో పాటే క్లీన్ అండ్ జర్క్ ఈవెంట్ లోనూ సత్తా చాటారు.

Jeremy Lalrinnunga: గోల్డ్ మెడల్ కోసం రెండేళ్లుగా ఇంటికే వెళ్లని జెరెమీ

Jeremy Lalrinnunga

Jeremy Lalrinnunga: సంవత్సరాల తరబడి కష్టబడిన జెరెమీ లాల్రిన్నుంగా కామన్వెల్త్ అరంగ్రేట సీజన్‌లోనే గోల్డ్ మెడల్ సాధించారు. ఈ 19ఏళ్ల అథ్లెట్ 67కేజీల కేటగిరీలో స్నాచ్ సెషన్ తో పాటే క్లీన్ అండ్ జర్క్ ఈవెంట్ లోనూ సత్తా చాటారు.

“నా కోచ్ బాగా మోటివేట్ చేశారు. ప్రత్యేకించి వార్మప్ సమయంలో గాయమైనప్పుడు. బాగా ఏడ్చా. దేవుడ్ని ప్రార్థించా. ఇప్పుడు బెటర్ గా ఫీలవుతున్నా. గర్విస్తున్నా కూడా. 300 కేజీలు ఎత్తాలని అనుకున్నా. ఈ క్రమంలోనే 315-320కేజీల కోసం ప్రిపేర్ అయ్యా. ఎలా అయితే ఇది సరిపోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది” అని జెరెమీ లాల్రిన్నుంగా అన్నారు.

“యూత్ ఒలింపిక్స్ తర్వాత మళ్లీ ఇలాంటి లక్ష్యాన్ని చేధించలేకపోయా. సీనియర్ లెవల్ కాంపిటీషన్ లో ఇది నా తొలి మెడల్. యూత్ ఒలింపిక్స్ తర్వాత మెడల్ ఎప్పుడు తెస్తావని అడిగేవారు. నా దేశం కోసం పతకం సాధించేందుకు కఠినంగా శ్రమిస్తూనే ఉన్నా. కావాలనుకున్నదే సాధించా” అని పేర్కొన్నారు.

Read Also: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం.. వెయిట్‌ లిఫ్టింగ్‌లో రజతం

“రెండేళ్లుగా ఇంటికి కూడా వెళ్లలేదు. నా కోచ్ ను వీకాఫ్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంటికెళ్లి నా పేరెంట్స్, సోదరుడితో గడపాలనుకుంటున్నాను” అని చెప్తున్నారు జెరెమీ.

షెయులీ స్వర్ణంతో, భారత వెయిట్‌లిఫ్టింగ్ బృందం కామన్వెల్త్ గేమ్స్‌లో ఆరో పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు పురుషుల 67 కేజీల విభాగంలో 19 ఏళ్ల జెరెమీ లాల్రిన్నుంగా స్వర్ణ పతకాన్ని సాధించాడు.