ఆ సైకోలను వదిలేది లేదు, క్రాకర్స్ తో ఏనుగుని చంపిన ఘటనపై కేంద్రం సీరియస్

కేరళలో క్రాకర్స్ పెట్టి గర్భంతో ఉన్న ఏనుగును చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ పని చేసిన వారిని శాడిస్టులు, సైకోలుగా

  • Published By: naveen ,Published On : June 4, 2020 / 06:32 AM IST
ఆ సైకోలను వదిలేది లేదు, క్రాకర్స్ తో ఏనుగుని చంపిన ఘటనపై కేంద్రం సీరియస్

కేరళలో క్రాకర్స్ పెట్టి గర్భంతో ఉన్న ఏనుగును చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ పని చేసిన వారిని శాడిస్టులు, సైకోలుగా

కేరళలో క్రాకర్స్ పెట్టి గర్భంతో ఉన్న ఏనుగును చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ పని చేసిన వారిని శాడిస్టులు, సైకోలుగా అభివర్ణిస్తున్నారు. వారిని ఊరికే వదలకూడదని అంటున్నారు. కేరళలో ఏనుగు మృతి ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నివేదిక ఇవ్వాలని కోరింది. నిందితులను వదిలిపెట్టబోమని కేంద్రం స్పష్టం చేసింది. నిందితులను పట్టుకునేందుకు కేసు దర్యాప్తులో ఏ ఒక్క అంశాన్ని వదలబోమంది. క్రాకర్స్ తినిపించి ఏనుగుని చంపడం భారతీయ సంస్కృతి కాదని కేంద్ర అటవీశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. 

అమాయక జంతువుల హత్య సాటి మనుషుల హత్యే:
పైనాపిల్‌లో బాణాసంచా పెట్టి ఏనుగు మృతికి కారణమైన వారిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమాయక ఏనుగును క్రూరంగా చంపిన ఘటన తనని కలచివేసిందని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా వాపోయారు. అమాయక జంతువుల హత్యను సాటి మనుషుల హత్యగానే పరిగణించాలన్నారు. ఏనుగును చంపిన ఘటనను తీవ్రంగా ఖండించారు క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ దంపతులు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలీవుడ్‌ నటులు అక్షయ్‌ కుమార్‌, జాన్‌ అబ్రహం, శ్రద్ధాకపూర్‌, రణ్‌దీప్‌ హుడా, తెలుగు నటి ప్రణీత డిమాండ్‌ చేశారు. ఏనుగు ప్రాణం తీసిన నిందితుల ఆచూకీ తెలిపితే రూ.50 వేలు ఇస్తామని హ్యుమన్‌ సొసైటీ ఇంటర్నేషనల్‌ ఆఫ్‌ ఇండియా బహుమతి ప్రకటించింది.

అసలేం జరిగిందంటే:
కేరళలోని మలప్పురంలో ఓ ఆడ ఏనుగు ఊళ్లో నుంచి వెళ్తుండగా కొందరు దానికి పైనాపిల్ ఆశ జూపారు. ప్రేమతో ఇస్తున్నారనుకుని ఆ ఏనుగు పండును తీసుకొని నోట్లో పెట్టుకుంది. అయితే ఈ దుర్మార్గులు పైనాపిల్ లో టపాసులు నింపారు. దాంతో నోట్లో పెట్టుకోగానే అది పేలింది. ఏనుగు దవడలు, నోటికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆ ఏనుగు రక్తమోడుతూ.. అంత బాధలోనూ ఎవరికీ హాని చేయకుండా అక్కడి నుంచి వెళ్లి పోయింది. బాధను తాళలేక సమీపంలోని వెల్లియార్ నదిలోకి దిగింది. తన నోటిని నీటిలోకి ముంచి ఉపశమనాన్ని పొందింది. గాయం కారణంగా ఆహారం తీసుకునే అవకాశం లేకపోవడంతో రోజుల తరబడి నీళ్లు తాగుతూ బతికింది. ఏనుగు నీట్లోనే కదలకుండా ఉండిపోవడాన్ని గమనించిన కొందరు వెటర్నరీ డాక్టర్‌కు సమాచారం అందించారు. ఆహారం లేకపోవడం, గాయాల తీవ్రత ఎక్కువ కావడంతో మే 27న ఏనుగు ప్రాణాలు విడిచింది. ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించగా అది నెలరోజుల గర్భింతో ఉన్నట్టు తేలింది. మానవత్వం మరిచిన కొందరి పైశాచిక ఆనందానికి ఏనుగుతోపాటు దాని కడుపులోని బిడ్డ కూడా బలైంది. ఈ ఘటన యావత్ దేశాన్ని కంటతడి పెట్టించింది.

Read:  Crackers తిని మరో ఏనుగు చనిపోయింది!