Metpally Children Kidnap Case : వార్నీ.. ఏం పిల్లలు రా.. కరాటే క్లాసులు తప్పించుకునేందుకు కిడ్నాప్ డ్రామా

జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో పిల్లల కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. కిడ్నాప్ వ్యవహారం అంతా పిల్లలు ఆడిన డ్రామాగా పోలీసులు తేల్చారు. కరాటే క్లాస్ నుంచి తప్పించుకోవడానికి ఇద్దరు పిల్లలు కలిసి ఆడిన నాటకం అని చెప్పారు. ఇద్దరు పిల్లలు ఇంటి దగ్గర క్షేమంగా ఉన్నారని తెలిపారు.

Metpally Children Kidnap Case : వార్నీ.. ఏం పిల్లలు రా.. కరాటే క్లాసులు తప్పించుకునేందుకు కిడ్నాప్ డ్రామా

Metpally Children Kidnap Case : జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో పిల్లల కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. కిడ్నాప్ వ్యవహారం అంతా పిల్లలు ఆడిన డ్రామాగా పోలీసులు తేల్చారు. కరాటే క్లాస్ నుంచి తప్పించుకోవడానికి ఇద్దరు పిల్లలు కలిసి ఆడిన నాటకం అని చెప్పారు. ఇద్దరు పిల్లలు ఇంటి దగ్గర క్షేమంగా ఉన్నారని తెలిపారు.

ఉదయం కరాటే క్లాసులకు వెళ్తున్న తమను దుండగులు కిడ్నాప్ చేసి మెట్ పల్లి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో వదిలి వెళ్లారని, తమ తల్లిదండ్రులతో చెప్పారు పిల్లలు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో షాకింగ్ నిజం వెలుగుచూసింది. కరాటే క్లాసులకు వెళ్లకుండా పిల్లలు సైకిల్ మీద హైవే పైకి వెళ్లారని పోలీసులు నిర్ధారించారు. కరాటే క్లాసులకు వెళ్లడం ఇష్టలేకనే పిల్లలు కిడ్నాప్ డ్రామా ఆడారని మెట్ పల్లి ఎస్ఐ సుధాకర్ తేల్చారు. పిల్లలు చేసిన పనికి పోలీసులే కాదు.. వారి తల్లిదండ్రులు సైతం షాక్ అయ్యారు. కరాటే క్లాసులకు వెళ్లడం ఇష్టలేకపోతే తమతో నేరుగా చెప్పాలి కానీ, ఇలా కిడ్నాప్ డ్రామా ఆడి అందరినీ భయాందోళనకు గురి చేయడం ఏంటని విస్తుపోతున్నారు. పిల్లలు చేసిన పనికి ముక్కున వేలేసుకున్నారు. వామ్మో.. వీళ్లేం పిల్లలు అవాక్కవుతున్నారు.