టీ పెట్టలేదని భార్యను కొడితే ఊరుకోం..ఆమె మీ సొంత ఆస్తికాదు : హైకోర్టు కీలక వ్యాఖ్యలు

టీ పెట్టలేదని భార్యను కొడితే ఊరుకోం..ఆమె మీ సొంత ఆస్తికాదు : హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Not making tea no provocation for husband to assault wife : భార్య టీ పెట్టనని అన్నదని భర్త భార్యపై దాడి చేస్తే న్యాయస్థానాలు ఊరుకోవని బాంబే హైకోర్టు ఓ భర్తకు ఝలక్ ఇచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య అంటూ భర్త ఆస్తికాదని గుర్తుంచుకోవాలని ఆమె ఇష్టా అయిష్టాలను భర్త గ్రహించాలని సూచించింది. భర్త పెట్టమని చెప్పిన సమయానికి భర్త టీ పెట్టలేదని ఆమెను భర్త కొట్టటం సరైంది కాదనీ అది భర్తను రెచ్చగొట్టటం కాదని..బాండూ హైకోర్టు స్పష్టంచేసింది. భార్యపై దాడి చేసినందుకు 35 ఏళ్ల వ్యక్తికి కింది కోర్టు విధించిన శిక్షను బాంబే హైకోర్టు సమర్థించింది.

ఈ సందర్భంగా జస్టిస్ రేవతి మోహితే దేరే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘భార్య అంటే భర్త ఆస్తి కాదనీ..ఆమె ఒక వస్తువు కాదని తెలుసుకోవాలని సూచించింది. వివాహం అనేది సమానాత్వం మీద ఆధారపడిన స్నేహం. కానీ సమాజంలో అటువంటి ఆలోచనలు ఉండటం లేదు. ఇది లింగం – వక్రీకృత పితృస్వామ్య వ్యవస్థని సూచిస్తోందని వ్యాఖ్యానించింది. సమాజంలోని పితృస్వామ్య భావజాలం వేళ్లూనుకుపోయిందని..స్త్రీ పురుషుడి ఆస్తి అనే ఆలోచన సమాజంలో ఇప్పటికీ ప్రబలంగా ఉందని ఇటువంటి ఆలోచనలు మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉందని వ్యాఖ్యానించింది. ఇటువంటి పితృస్వామ్య భావజాలమే ఓ వ్యక్తి తన భార్యను తన సొంత ఆస్థిగా భావించేలా చేసిందని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది.

‘‘సమాజంలోని లింగ వివక్షత వల్ల ఇంటి పని బాధ్యత భార్యదే అనే భావం పాతుకుపోయిందనీ.. ఈ లింగ వివక్షత వల్ల భార్య ఇంటి పనికే పరిమితమైపోయింది. సాధికారత దిశగా పయనించే మహిళలు కొంతమందే ఉన్నారనీ..కానీ ఇంటికే పరిమితం అయిపోయిన మహిళలు చాలామంది ఉన్నారని తెలిపింది. ఇంటి పనులన్నీ ఆడవాళ్లే చేయాల్సిన పనులనే ఆలోచన సమజంలో పాతుకుపోయింది. ఇక వివాహంలో భార్య నుంచి భావోద్వేగ శ్రమను కూడా ఆశిస్తున్నారు. సామాజిక పరిస్థితులు కూడా మహిళను తన అత్తారింటికి అంకితం అయ్యేలా ప్రేరేపిస్తున్నాయనీ..దాంతో పురుషులు మహిళలకు అంటే భార్యల్ని తమ స్తిరాస్తిగా భావిస్తున్నారు’’ అని హై కోర్టు అభిప్రాయపడింది.

ఈ కేసులో సదరు భార్యాభర్తల కుమార్తె ఇచ్చిన సాక్ష్యాన్ని బాంబే హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఆమె ఇచ్చిన సాక్ష్యంపై పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేసింది. ఆమెను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయాల్సిన అవసరమే లేదని స్పష్టంచేసింది హైకోర్టు.. భర్తకు కింది కోర్టు విధించిన శిక్షను కొనసాగించాలని కోర్టు స్పష్టం చేస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

టీ పెట్టలేదని భార్యను భర్త కొట్టిన కేసు వివరాలు..
సోలాపూర్ జిల్లాలోని పంధర్‌పూర్ ప్రాంతానికి చెందిన సంతోష్‌ అక్తర్‌ అనే వ్యక్తికి భార్యతో ఎప్పుడూ ఏదో విధంగా గొడవపడుతునే ఉంటాడు. దీంతో కుటుంబంలో మనశ్శాంతి అనేదే లేకుండా పోయింది. ఎప్పుడూ ఏదోక గొడవ జరుగుతుండేది. ఈ క్రమంలో 2013 డిసెంబర్‌లో సంతోష్ అక్తర్ కు భార్యను టీ పెట్టమని అడిగాడు. అందుకు ఆమె పట్టించుకోకుండా బయటకు వెళ్లిపోయింది. దీంతో సంతోష్ అక్తర్ కు కోపం తారాస్థాయికి వెళ్లింది. నేను చెప్పినపని చేయవా? నా మాట అంటే లెక్కలేదా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. కోపంతో ఒళ్లూ పై తెలియకుండా భార్యమీద విరుచుకుపడ్డాడు. ఆ కోపంలో మనిషి అనే మాటే మరిచిపోయిన అక్తర్‌ భార్యను సుత్తితో తలపై బాదాడు. ఆ దెబ్బకు ఆమె ఒక్కసారిగా పెద్ద కేక పెట్టి కుప్పకూలిపోయింది. తల్లి పెట్టిన కేకతో హడలిపోయిన వారి ఆరు ఏళ్ల కూతురు పరుగు పరుగున వచ్చి చూడగా.. తండ్రి తల్లిని దారుణంగా కొట్టడం చూసింది. రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని చూసింది. ఈ విషయం ఎవరికన్నా తెలిస్తే ఏమవుతుందో ననే భయంతో అక్తర్ అక్కడి రక్తాన్ని శుభ్రం చేసేసి..ఆ తరువాత భార్యను హాస్పిటల్ కు తీసుకెళ్లాడు..

భర్త దాడితో స్పృహ కోల్పోయిన ఆమె హాస్పిటల్ లో చికిత్స తరువాత వారం రోజులకు కోలుకుంది. స్పృహలోంచి బైటకొచ్చింది. ఆ తరువాత ఆమె కోలుకుని భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమదో చేసుకుని విచారణ చేపట్టగా అక్తర్ ‘‘తన భార్య టీ పెట్టడానికి నిరాకరించి తనను రెచ్చగొట్టిందని.. అందుకే దాడి చేశానని తెలిపాడు. దీంతో ఈ కేసును పోలీసులు స్థానిక కోర్టులో ప్రవేశ పెట్టగా 2016లో అక్తర్‌కి 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. నరహత్య ఆరోపణలపై అతడికి ఈ శిక్ష విధించింది. దాంతో అతడు క్రింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బాంబే హై కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు విచారణ చేసని బాంబే హైకోర్లు కింది కోర్టు తీర్పును హై కోర్టు సమర్థించింది.

కాగా..ఈ కంప్యూర్ యుగంలో కూడా ఎంతోమంది భర్తలు భార్యలను ఓ ఆస్తిలా చూస్తారు.ఓ వస్తువులా చూస్తారు. ఆమెకంటూ ఇష్టాలు అయిష్టాలు ఉంటాయని ఆలోచించరు. తాము చెప్పినట్లల్లా చేయాలంటారు. చిన్నపాటి వ్యతిరేకత భార్యనుంచి వచ్చినా భరించలేదు. వారి మగ అహంకారం దెబ్బతింటుంది. తాను చేయమని చెప్పిన పని చేయకపోతే వెంటనే కోపం వస్తుంది. ఆ కోపాన్ని ఇష్టమొచ్చినట్లుగా భార్యలమీద చూపిస్తుంటారు. అది తిట్టటంలో కావచ్చు కొట్టటం కూడా కావచ్చు. అటువంటి భర్తకు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పునే కొనసాగించాలని తీర్పునిచ్చి సదరు భర్తకు దిమ్మ తిరిగేలా చేసింది.