Nitish Kumar: ప్రధాని కావాలన్న ఆలోచన లేదు: నితీష్ కుమార్

తనకు ప్రధాని కావాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు బిహార్ సీఎం నితీష్ కుమార్. ఈ అంశంపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఎవరో చేస్తున్న ప్రచారాన్ని తాను పట్టించుకోనని చెప్పారు. బిహార్‌లోనే ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు.

Nitish Kumar: ప్రతిపక్షాల ప్రధాన మంత్రి అభ్యర్థిగా బిహార్ సీఎం నితీష్ కుమార్ నిలబడే అవకాశాలున్నాయని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. తనకు అలాంటి ఆలోచన లేదని నితీష్ చెప్పారు. ఇటీవల బీజేపీతో పొత్తుకు స్వస్తి పలికి, ఆర్‌జేడీతో కలిసి బిహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Divya Kakran: దివ్యా కాక్రన్ వివాదం.. ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

ఆయన బీజేపీకి దూరం కావడంతో, భవిష్యత్తులో మోదీకి పోటీగా ప్రధాని అయ్యే ఉద్దేశంతోనే ఈ పని చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ప్రతిపక్షాల తరఫున ఆయన ప్రధాన మంత్రి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇదే అంశంపై నితీష్ కుమార్‌ను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన తనకు ప్రధాని కావాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. ‘‘నేను చేతులు జోడించి చెబుతున్నాను. నాకు ప్రధాని కావాలన్న ఆలోచన లేదు. నేను అందరికోసం పనిచేస్తా. ప్రతిపక్షాలు కూడా కలిసి పనిచేసేలా చేయడమే నా ఉద్దేశం. అది జరిగితే చాలా మంచిది. నాకు వీలైనంతగా పనిచేస్తా. ఈ విషయంపై అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయి.

TS EAMCET: తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల.. ఏపీ విద్యార్థినికి మొదటి ర్యాంకు

అయితే, ముందుగా నేను ఇక్కడ (బిహార్‌లో) పని చేయాలి. ప్రధాని కావడం నా చేతుల్లో లేదు. దీని గురించి ఎవరేం చెబుతున్నారో నాకు అనవసరం. నా సన్నిహితులు చెబుతున్నదానితో కూడా నాకు సంబంధం లేదు’’ అని నితీష్ వ్యాఖ్యానించారు.

 

ట్రెండింగ్ వార్తలు