EGGS : పాలలోనే కాదు..గుడ్డులోను పోషకాలు అధికమే!

పోషకాహార లోపంతో ఉన్నవారు, బరువు తక్కువగా ఉన్నవారు వారానికి 6 గుడ్ల వరకు తినొచ్చు. గర్భిణీలు, స్త్రీలు రోజుకో గుడ్డు తినటం వల్ల మంచి పోషకాలు లభిస్తాయి. నాటు గుడ్డులో, ఫారం గుడ్డులో ఉండే పోషకాల్లో ఎలాంటి తేడా ఉండదు.

EGGS : పాలలోనే కాదు..గుడ్డులోను పోషకాలు అధికమే!

Fried Eggs Or Scrambled Eggs Ingredients On A Lovely Set Up

EGGS : పాలను సంపూర్ణ ఆహారంగా భావిస్తారు చాలా మంది. అందుకే పిల్లల ఎదుగుదలకు రోజుకొక గ్లాసు పాలు ఇవ్వమని నిపుణులు సూచిస్తుంటారు. అయితే పాలలో మాత్రమే కాదు గుడ్డులోను పాలతో సరిసమానంగా పోషకాలు లభిస్తాయి. ఇదే విషయాన్ని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గుడ్డులో విటమిన్ సి, పీచు పదార్ధం మినహా మిగిలిన అన్ని పోషకాలు, విటమిన్లు , ఖనిజాలు ఉంటాయి. అన్ని వయస్సుల వారికి ఇది ఆరోగ్యకరమైన ఆహారం. ఎదిగే పిల్లలకు గుడ్డు మంచి పోషకాహారంగా చెప్పవచ్చు.

వృక్ష సంబంధమైన పప్పులో ఉండే ప్రొటీన్ల కంటే గుడ్డులో ఉండే ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. గుడ్డులో సంపూర్ణ మాంసకృత్తులతో కూడిన ప్రొటీన్లు ఉంటాయి. హార్మోన్ల విడుదలకు, ఎంజైమ్ లతయారీకి గుడ్డులోని ప్రొటీన్లు తోడ్పడతాయి. గుడ్డులో లభించే ప్రొటీన్లు తేలికగా జీర్ణమౌతాయి. చిన్నపిల్లలకు 8మాసాల నుండే ఉడికించిన గుడ్డులోని పచ్చసొనను తినిపించవచ్చు. ఏడాది నిండిన వారికి పూర్తి స్ధాయి గుడ్డును పెట్టవచ్చు.

పోషకాహార లోపంతో ఉన్నవారు, బరువు తక్కువగా ఉన్నవారు వారానికి 6 గుడ్ల వరకు తినొచ్చు. గర్భిణీలు, స్త్రీలు రోజుకో గుడ్డు తినటం వల్ల మంచి పోషకాలు లభిస్తాయి. నాటు గుడ్డులో, ఫారం గుడ్డులో ఉండే పోషకాల్లో ఎలాంటి తేడా ఉండదు. రెండింటిలో పోషకాలు ఒక విధంగా లభిస్తాయి. కోడికి అందించే పోషక విలువలతో కూడిన దాణాను బట్టి గుడ్డులోని పోషకాల మోతాదు ఉంటుంది. గుడ్డును అమ్లెట్ రూపంలో తినేకంటే ఉడికించుకుని తినటం మంచిది. గుడ్డు తెల్లసొన లో ఉండే ప్రొటీన్ వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునే వారికి బాగా ఉపకరిస్తుంది. రోజుకు ఒక గుడ్డు తినటం మూలంగా శరీరానికి 180 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ అందుతుంది.