Windows 11 Update: విండోస్ 11 అప్‌డేట్ కోసం నోట్‌ప్యాడ్ యాప్ ఉండాల్సిందే

మైక్రోసాఫ్ట్ నుంచి లేటెస్ట్‌గా రిలీజ్ అయిన విండోస్ 11 అప్‌డేట్ కావాలంటే కచ్చితంగా Notepad యాప్ ఉండాల్సిందే. అది కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయిన కొత్త నోట్ ప్యాడ్ టూల్ మాత్రమే.

Windows 11 Update: విండోస్ 11 అప్‌డేట్ కోసం నోట్‌ప్యాడ్ యాప్ ఉండాల్సిందే

Windows 11 Update

Windows 11 Update: మైక్రోసాఫ్ట్ నుంచి లేటెస్ట్‌గా రిలీజ్ అయిన విండోస్ 11 అప్‌డేట్ కావాలంటే కచ్చితంగా Notepad యాప్ ఉండాల్సిందే. అది కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయిన కొత్త నోట్ ప్యాడ్ టూల్ మాత్రమే. దీనికి సంబంధించిన ఫొటోను కూడా కూడా పోస్టు చేశాడు ఒక మైక్రోసాఫ్ట్ ఎంప్లాయ్.

దీనిని బట్టి చూస్తుంటే లేటెస్ట్ అప్‌డేట్‌కు న్యోట్ ప్యాడ్ యాప్ కచ్చితంగా ఉండాల్సిందేనని అర్థం అవుతుంది. రోజుకు మిలియన్ల కొద్దీ యూజర్లు వాడుతున్న నోట్ ప్యాడ్ అప్ గ్రేడ్ చేసుకుంటేనే ఇది వీలవుతుందట. విండోస్ 11 అప్ డేట్ అయిన తర్వాత ఎలాగూ ఈ యాప్ మరింత స్టైలిష్ గా కనిపిస్తుంది.

స్క్రీన్ షాట్ ను బట్టి చూస్తే.. విండోస్ 11యాప్ చాలా ప్లాట్ ఫాం టూల్స్ ను కొత్తగా చూపించనుందని తెలుస్తోంది. ఇంకా చూడటానికి యాప్ విండోలో, మెనూస్, పాప్ అప్ నోటిఫికేషన్స్ అన్నీ రౌండ్ కార్నర్స్ లో కనిపిస్తున్నాయి. ఈ లీక్ లో కొత్త ఐకాన్లు, యానిమేషన్లు, డెడికేటెడ్ సెట్టింగ్స్ పేజ్ వంటివి కనిపిస్తున్నాయి. నోట్ ప్యాడ్ లో మాత్రం ఫాంట్ సెట్టింగ్.. (స్టైల్, ఫ్యామిలీ, సైజ్) లాంటి మార్పులు కొత్తగా వచ్చాయి.

………………………………………………..: బాబు క్వార్ట‌ర్ అంటే ఎంత‌?.. స్టూడెంట్ సమాధానం విని కంగుతిన్న ప్రొఫెసర్

నోట్ ప్యాడ్ విండోస్ 1.0 ఆపరేటింగ్ సిస్టమ్ అప్పటి నుంచి ఆటోమేటిక్ గా ఇన్‌స్టాల్ అయి వస్తుంది. 1985లో ఆపరేటింగ్ సిస్టమ్ రిలీజ్ అయింది. 1995లో విండోస్ 95 ఆపరేటింగ్ సిస్టమ్ లో భాగంగా వర్డ్ ప్యాడ్ కు దాంతో పాటు కలిపి రిలీజ్ అయింది.