Nothing Phone (1) : ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (1)పై భారీ డిస్కౌంట్.. ఇదే సరైన సమయం.. డీల్ ముగిసేలోపే వెంటనే కొనేసుకోండి..!

Nothing Phone (1) : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం నథింగ్ ఫోన్ (1) (Nothing Phone (1) ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ పొందింది. అత్యంత వినూత్నమైన డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్ దాదాపు రూ.6500 తగ్గింపుతో విక్రయిస్తోంది. నథింగ్ ఫోన్ (1) రూ.32,999కి లాంచ్ అయింది.

Nothing Phone (1) : ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (1)పై భారీ డిస్కౌంట్.. ఇదే సరైన సమయం.. డీల్ ముగిసేలోపే వెంటనే కొనేసుకోండి..!

Nothing Phone (1) gets a price cut of Rs 6500 on Flipkart, here’s how much the phone costs now

Nothing Phone (1) : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం నథింగ్ ఫోన్ (1) (Nothing Phone (1) ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ పొందింది. అత్యంత వినూత్నమైన డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్ దాదాపు రూ.6500 తగ్గింపుతో విక్రయిస్తోంది. నథింగ్ ఫోన్ (1) రూ.32,999కి లాంచ్ అయింది. జూలైలో ఫోన్ ధర రూ.1000 పెరిగింది. నథింగ్ ఫోన్ (1) అనేది కార్ల్ పీ నేతృత్వంలోని కంపెనీ ఫస్ట్ ప్రొడక్ట్. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 778+ ప్రాసెసర్‌తో పాటు 8GB వరకు RAMతో పనిచేస్తుంది. 50-Mp ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది.

Nothing Phone (1) gets a price cut of Rs 6500 on Flipkart, here’s how much the phone costs now

Nothing Phone (1) gets a price cut of Rs 6500 on Flipkart

డీల్ ఎలా పొందాలంటే? :
నథింగ్ ఫోన్(1) ధర ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.27,499గా ఉంది. ఈ డివైజ్ గతంలో రూ.33,999గా ఉండేది. దాదాపు రూ. 6500 డిస్కౌంట్‌తో వచ్చింది. అదనంగా, PNB క్రెడిట్ కార్డ్ లేదా ఫెడరల్ బ్యాంక్ కార్డ్ ఉపయోగించి పేమెంట్స్ చేస్తే కొనుగోలుదారులు 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డీల్‌ను మరింత తక్కువ ధరకే పొందాలంటే కొనుగోలుదారులు పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. దీని నథింగ్ ఫోన్ (1) విలువ రూ.11,500 వరకు ఉంటుంది. పాత ఫోన్ విలువ ఫోన్ కండిషన్, ఏడాది, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుందని గమనించాలి.

నథింగ్ ఫోన్ (1) : స్పెసిఫికేషన్‌లు ఇవే :
నథింగ్ ఫోన్ (1) 6.55-అంగుళాల Full-HD+ 10-బిట్ OLED ప్యానెల్‌ను కలిగి ఉంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 778G+ చిప్‌సెట్‌తో పాటు 12GB వరకు RAM, 256GB స్టోరేజీతో పొందవచ్చు. స్టోరేజీ సపోర్టు లేదు. ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ OS అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది.

Nothing Phone (1) gets a price cut of Rs 6500 on Flipkart, here’s how much the phone costs now

Nothing Phone (1) gets a price cut of Rs 6500 on Flipkart

నథింగ్ ఫోన్ (1) 4,500mAh బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. మీరు బాక్స్ లోపల ఛార్జర్‌ని పొందలేరని గమనించాలి. నథింగ్ ఫోన్ కోసం ఛార్జర్ రూ. 2499కి విడిగా అందుబాటులో ఉంది. కెమెరా విభాగంలో, నథింగ్ ఫోన్ (1) 50-MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో పాటు 50-MP ప్రైమరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌లకు ఫోన్‌లో 16-MP షూటర్ ఉంటుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Nothing Ear (Stick) Sale : నథింగ్ ఇయర్ స్టిక్ సేల్ మొదలైందోచ్.. అదిరిపోయే ఆఫర్లు.. డిస్కౌంట్ ధర ఎంతంటే?