NTR – Dhanush : ఎన్టీఆర్, ధనుష్ కాంబినేషన్‌లో మల్టీస్టార్రర్.. నిజమేనా?
ఇండియన్ ఇండస్ట్రీలోని ఇద్దరు వర్సటైల్ యాక్టర్స్ ఒక సినిమా కోసం చేతులు కలపబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, తమిళ హీరో ధనుష్ కలిసి ఒక భారీ మల్టీస్టార్రర్ లో భాగం కాబోతున్నారట.

NTR – Dhanush : ఇండియన్ ఇండస్ట్రీలోని ఇద్దరు వర్సటైల్ యాక్టర్స్ ఒక సినిమా కోసం చేతులు కలపబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, తమిళ హీరో ధనుష్ కలిసి ఒక భారీ మల్టీస్టార్రర్ లో భాగం కాబోతున్నారట. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీ, ఇండస్ట్రీకి మధ్య హద్దులు చెరిగిపోయాయి. ఇక్కడి నటులతో అక్కడి దర్శకులు, అక్కడి హీరోలతో ఇక్కడ దర్శకులు సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ధనుష్ ఇద్దరి తెలుగు దర్శకులతో చేతులు కలిపాడు. తాజాగా తెలుగు హీరోతో కూడా కలిసి పని చేసుందుకు సిద్దమవుతున్నాడు.
NTR : RRR ఆస్కార్‌కి వెళ్లడం నా గొప్పతనం కాదు, అతని గొప్పతనం.. ఎన్టీఆర్!
గతంలో ధనుష్ తో ‘అసురన్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో ఎన్టీఆర్, ధనుష్ కలిసి నటించబోతున్నారు అని తమిళ మీడియాలో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుందట. ఫస్ట్ పార్ట్ లో ఎన్టీఆర్ లీడ్ చేస్తాడని, సెకండ్ పార్ట్ ని ధనుష్ లీడ్ చేస్తాడని తమిళనాట గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ ని కలిసి వెట్రిమారన్ స్టోరీ వినిపించగా, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ సినిమా తరువాత ఈ సినిమా ఉండబోతుంది. ప్రస్తుతం ధనుష్ అండ్ వెట్రిమారన్ కూడా కమిట్ అయిన సినిమాలతో బిజీగా ఉన్నారు.
అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉంది అనేది తెలియదు. ఈ విషయం గురించి దర్శకుడు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే.. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు అది నిజం అయితే బాగుండు అని ఆశ పడుతున్నారు. కాగా మోస్ట్ అవైటెడ్ మూవీ NTR30 ఈ నెలలో మొదలు కాబోతుంది అంటూ ఎన్టీఆర్ అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానులకు తెలియజేశాడు. మర్చి నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాము అంటూ వెల్లడించాడు. ఇక ఎప్పుడెప్పుడు మొదలవుతుంది అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఈ న్యూస్ కొంచెం హుషారుని ఇచ్చింది.
EXCLUSIVE :
– #Vetrimaaran Narrated Three Stories to #JrNTR & he picked one..⭐
It is Said to be a Two part Film.. First Part will have JrNTR as Lead & #Dhanush as 2nd part Lead..?– Vetrimaaran will finish #VaadiVaasal & Will do pre production for a year for this one#NTR pic.twitter.com/WEUS5dja6O
— Prince B Sathya (@pkgsubin) February 5, 2023