‘ఆర్ఆర్ఆర్’ – తారక్, చరణ్ ప్రాక్టీస్ సెషన్..

‘ఆర్ఆర్ఆర్’ – తారక్, చరణ్ ప్రాక్టీస్ సెషన్..

NTR – Ram Charan: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘RRR- రౌద్రం రణం రుధిరం’..

RRR

ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినప్పటి నుండి టీమ్ వరుస అప్‌డేట్స్ ఇస్తోంది. రిలీజ్ డేట్‌తో చరణ్ గుర్రంపై, తారక్ బుల్లెట్‌పై వెళ్తున్న పోస్టర్ వదలగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది. గత వారం ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రేయసిగా నటిస్తున్న హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ పుట్టినరోజు సందర్భంగా ఆమె లుక్ రిలీజ్ చేశారు.

NTR - Ram Charan

తాజాగా తారక్, చెర్రీ షూటింగ్ స్పాట్‌లో ఉన్న పిక్స్ బయటకొచ్చాయి. అల్లూరిగా కోరమీసంతో చరణ్, భీమ్‌గా రఫ్ లుక్‌లో ఎన్టీఆర్ చిరునవ్వులు చిందిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. క్లైమాక్స్ షూటింగ్‌కి సంబంధించిన ట్రైనింగ్ సెషన్ అప్పటి ఫొటోలు ఇవి. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దసరా కానుకగా ఈ ఏడాది అక్టోబర్ 13 న ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కానుంది.

NTR - Ram Charan