NTR: కొరటాల కోసం ఎన్టీఆర్ మార్పులు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా రెండు క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించిన అప్‌డేట్స్ ఇచ్చి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందించాడు. దర్శకుడు కొరటాల శివతో తన 30వ....

NTR: కొరటాల కోసం ఎన్టీఆర్ మార్పులు..!

Ntr Doing Changes In Koratala Siva Script

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా రెండు క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించిన అప్‌డేట్స్ ఇచ్చి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందించాడు. దర్శకుడు కొరటాల శివతో తన 30వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసిన తారక్, ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో గ్లింప్స్‌ను వదిలాడు. అటు తన 31వ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో తారక్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు ఎప్పుడెప్పుడు మొదలువుతాయా.. వారు ఈ సినిమాల్లో తమ అభిమాన హీరోను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఉన్నారు.

NTR30-NTR31: కొరటాల-ఎన్టీఆర్-ప్రశాంత్.. ఫస్ట్ లుక్‌తోనే ప్రకంపనలు!

అయితే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తారక్ చేయబోయే 30వ చిత్రానికి సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమా స్క్రిప్టును ఇప్పటికే పూర్తి చేసిన కొరటాల, దాన్ని తారక్‌కు వినిపించాడట. కాగా.. స్క్రిప్టులపై పూర్తి పట్టు ఉన్న తారక్, కొరటాల చెప్పిన స్క్రిప్టులో పలు కీలక మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొరటాల స్క్రిప్టులోని పలు యాక్షన్, ట్విస్ట్, ఎమోషనల్ సీక్వెన్స్‌లలో తారక్ కొన్ని మార్పులు చేస్తున్నాడట. ఇక ఈ సినిమాను తొలుత జూన్ నెలలో పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కానీ ప్రస్తుతం స్క్రిప్టులో మార్పులు జరుగుతుండటం.. తారక్ ఈ సినిమా కోసం మరోసారి కొత్త మేకోవర్ ట్రై చేయనుండటంతో ఈ సినిమా మరింత ఆలస్యంగా పట్టాలెక్కనుంది.

NTR30: ఎన్టీఆర్ 30 వీడియోలో ఇది గమనించారా..?

ఈ సినిమాను ఆగస్టు నెలలో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ యోచిస్తోంది. ఇక ఈ సినిమాలో తారక్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. అందుకోసం ఏకంగా 8-9 కిలలో బరువు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాడు. గతంలో ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలవడంతో, ఈసారి అంతకు మించిన బ్లాక్‌బస్టర్‌ను ఆశిస్తున్నారు ఆడియెన్స్. మరి ఈ సినిమాలో తారక్ లుక్ మొదలుకొని, ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే అంశం వరకు ఇంకా అఫీషియల్‌గా తెలియాల్సి ఉంది. ఈ సినిమాను 2023 సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి అది ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి.