NTR: డైలమాలో ఎన్టీఆర్.. బయటపడేసేది ఎవరో?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను ఇప్పటికే అనౌన్స్ చేశాడు. కానీ, ఆయన ఇప్పటివరకు తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించలేదు. దీంతో తారక్ తన నెక్ట్స్ మూవీ విషయంలో డైలమాలో పడినట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

NTR: డైలమాలో ఎన్టీఆర్.. బయటపడేసేది ఎవరో?

Ntr In Dilemma About His Next Project

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అయ్యి కూడా దాదాపు ఆరు నెలలు కావస్తుంది. ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ ప్రాజెక్టులను తారక్ ఇప్పటికే అనౌన్స్ చేశాడు. తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివతో, 31వ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు తారక్ రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలను అనౌన్స్ చేసి కూడా నెలలు గడుస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క సినిమా కూడా పట్టాలెక్కలేదు. దీంతో తారక్ అభిమానులు ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

NTR : బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.. తారక్ వేసుకొచ్చిన షర్ట్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

అయతే తారక్ ప్రస్తుతం డైలమాలో ఉన్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తారక్ తన నెక్ట్స్ మూవీని కొరటాలతో ఇప్పటికే పట్టాలెక్కించాల్సి ఉన్నా.. కొరటాల లాస్ట్ మూవీ ఆచార్య డిజాస్టర్ నుండి ఆయన ఇంకా బయటపడలేదని తెలుస్తోంది. అందుకే తారక్ సినిమాలో జాప్యం జరుగుతోందట. ఇక ప్రశాంత్ నీల్ ‘సలార్’ మూవీలో బిజీగా ఉండటంతో, తారక్‌తో సినిమా ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమే.

NTR: బింబిసారుడి సమక్షంలో అందరికీ షాకిచ్చిన ఎన్టీఆర్

దీంతో తారక్ ఎవరితో సినిమా మొదలుపెట్టాలా అనే డైలమాలో పడిపోయాడట. ఎటూ తేల్చుకోలేకపోతున్న తారక్, తన నెక్ట్స్ మూవీని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడనేది ఇంకా సస్పెన్స్‌గానే మిగిలింది. మరి ఎన్టీఆర్‌ను ఈ డైలమా నుండి ఎవరు బయటపడేస్తారనేది చూడాలి. ఇక మరో డైరెక్టర్ బుచ్చిబాబు కూడా తారక్ కోసం ఓ కథను రెడీ చేయగా, దాని విషయంలోనూ తారక్ ఎటూ తేల్చలేకపోతున్నాడట. ఏదేమైనా తమ అభిమాన హీరో నెక్ట్స్ సినిమా కోసం ఇలా డైలమాలో పడిపోవడంతో తారక్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు.