ఎన్టీఆర్ షూ ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు..!

ఎన్టీఆర్ షూ ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు..!

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ఇద్దరు పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ క్యూట్ పిక్స్ షేర్ చేయగా సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు తారక్‌కి సంబంధించి న్యూస్ ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది.

అది సినిమా అప్‌డేట్ అయితే కాదు కానీ తారక్ స్టైలింగ్ గురించి.. సెలబ్రిటీల డ్రెస్సింగ్ స్టైల్‌కి ఫ్యాన్స్, ఆడియెన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. వారు ధరించే గాగుల్స్, వాచెస్ నుండి ప్రతీదీ స్పెషల్‌గానే కనిపిస్తుంటాయి. అలా ఇప్పుడు ఎన్టీఆర్ షూస్ కాస్ట్ గురించిన వార్త వైరల్ అవుతోంది.

https://10tv.in/jr-ntr-shares-his-kids-cute-pics-and-wishing-everyone-a-merry-christmas/

ఇటీవల యంగ్ టైగర్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించాడు. ఆ ఫొటోలో తారక్ వేసుకున్న HERMES బ్రాండ్ షూస్ గమనించిన ఫ్యాన్స్ గూగుల్‌లో సెర్చ్ చేశారు. షూ కాస్ట్ అక్షరాలా రూ. 75 వేలు అని చూపించడంతో ఫొటోషాప్‌లో పిక్స్ డిజైన్ చేసి సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు.

NTR

 

NTR