NTR: తేజు కోసం వస్తున్న తారక్.. పండగ చేసుకోనున్న ఫ్యాన్స్!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను కార్తిక్ దండు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో తేజు పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

NTR: తేజు కోసం వస్తున్న తారక్.. పండగ చేసుకోనున్న ఫ్యాన్స్!

NTR: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను కార్తిక్ దండు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో తేజు పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

Sai Dharam Tej: తేజు బర్త్‌డే గిఫ్ట్.. SDT15 నుండి ఇంటెన్స్ పోస్టర్!

ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, టీజర్‌లను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ టీజర్ లాంఛ్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా చేయాలని వారు ప్లాన్ చేస్తున్నారట. తారక్‌కు మెగా ఫ్యామిలీతో మంచి రిలేషన్, బాండింగ్ ఉన్న నేపథ్యంలో ఆయనతో ఈ సినిమాను ప్రమోట్ చేయిస్తే, ఇది ఆడియెన్స్‌లోకి బాగా వెళ్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమా టైటిల్, టీజర్‌లను డిసెంబర్ 7న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Sai Dharam Tej: తేజ్‌కు క్షుద్రపూజల ఎఫెక్ట్..?

కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలోని థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాలో తేజు సరసన అందాల భామ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చరిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కాంతార చిత్రానికి అదిరిపోయే సంగీతాన్ని అందించిన అంజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఏదేమైనా మెగా హీరో సినిమాను ప్రమోట్ చేసేందుకు మరోసారి తారక్ ముందుకు వస్తుండటంతో మెగా, నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.