#NKR18-Bimbisara: అన్న కోసం తమ్ముడి గాత్రదానం.. ఫ్యాన్స్ కు పండగే!

మన స్టార్ హీరోలు ఒకరి సినిమాలకు మరొకరి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి, మహేష్ నుండి మొదలు చాలామంది తోటి హీరోల సినిమాల కోసం వారి గాత్రాన్ని దానం చేసినవారే

#NKR18-Bimbisara: అన్న కోసం తమ్ముడి గాత్రదానం.. ఫ్యాన్స్ కు పండగే!

Ntr Voice For Him Brother Festival For Fans

#NKR18-Bimbisara: మన స్టార్ హీరోలు ఒకరి సినిమాలకు మరొకరి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి, మహేష్ నుండి మొదలు చాలామంది తోటి హీరోల సినిమాల కోసం వారి గాత్రాన్ని దానం చేసినవారే. కాగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడట. అది కూడా తన అన్న కళ్యాణ్ రామ్ సినిమా కోసమేనట. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం బింబిసార సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ తో పాటు టైటిల్ రివీల్ చేస్తున్నప్పుడు రిలీజ్ చేసిన వీడియో కూడా ఈ సినిమా మీద అంచనాలు పెంచేసింది. కళ్యాణ్ రామ్ ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా కొత్తగా కనిపిస్తున్నాడనే చెప్పాలి. శత్రువులను చంపి వారి శవాలను గుట్టగా పేర్చి వాటి మీద కూర్చుని పవర్ఫుల్ లుక్ లో కనిపించగా ఎ టైం ట్రావెల్ ఫ్రొం ఈవిల్ టు గుడ్ అనే ఈవిల్ ట్యాగ్ లైన్ తో అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించాడు.

ఇప్పటికే ఈ సినిమా మీద భారీ హైప్ నెలకొంది. బింబిసార ఎవరు.. అతని చరిత్ర ఏంటని ప్రేక్షకులు చరిత్రను తవ్వుతున్నారు. ఇక ఈ సినిమాపై మరింత క్రేజ్ పెంచేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాలో ఎన్టీఆర్ వాయిస్ వినిపించనుందట. హిస్టారికల్ సినిమా కనుక ఆ స్థాయిలోనే హంగులు ఉండాలని భావిస్తున్న టీం అందుకు ఎన్టీఆర్ క్రేజ్ కూడా వాడుకోవాలని భావిస్తున్నారట. ఈ సినిమాతో వశిష్ట మల్లిడి అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతుండగా మరి ఈ సినిమా కళ్యాణ్ రామ్ ను ఎంతవరకు సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందో చూడాలి!