Startups: దేశంలో పెరుగుతున్న స్టార్టప్‌లు… ఆరేళ్లలో గణనీయ ప్రగతి

దేశంలో ఆరేళ్లలో స్టార్టప్‌ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్రం చేపట్టిన ‘స్టార్టప్ ఇండియా’ కార్యక్రమం ద్వారా వీటి సంఖ్య పెరిగినట్లు కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో వెల్లడించారు.

Startups: దేశంలో పెరుగుతున్న స్టార్టప్‌లు… ఆరేళ్లలో గణనీయ ప్రగతి

Startups

Startups: దేశంలో స్టార్టప్‌ల సంఖ్య కొన్నేళ్లలో భారీగా పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. 2016లో 471 స్టార్టప్‌లు మాత్రమే ఉండగా, 2022 జూన్ 30 నాటికి 72,993 స్టార్టప్‌లు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి సోమ్ ప్రకాష్ పార్లమెంటులో ఈ వివరాల్ని వెల్లడించారు.

Covid Vaccine: ఒక్క డోసు కూడా తీసుకోని 4 కోట్ల మంది.. కేంద్రం ప్రకటన

‘‘2016 జనవరిలో కేంద్రం స్టార్టప్ ఇండియా అనే కార్యక్రమం ప్రారంభించింది. స్టార్టప్‌లు ఏ దేశానికైనా మేలు చేస్తాయి. ఆర్థికంగానే కాకుండా, ఉపాధి కల్పనలో, సాంకేతికాభివృద్ధిలో తోడ్పడుతాయి’’ అని సోమ్ ప్రకాష్ అన్నారు. కేంద్ర పరిశ్రమల శాఖ అంచనా ప్రకారం.. దేశంలో మొత్తం 56 వేర్వేరు రంగాల్లో స్టార్టప్‌లు కొనసాగుతున్నాయి. అందులో 4,500 పైగా స్టార్టప్‌లు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అనలిటిక్స్ వంటి కొత్తగా పుట్టుకొస్తున్న టెక్నాలజీలోనే కొనసాగుతున్నాయి. స్టార్టప్‌లకు రూ.1.50 కోట్ల వరకు గ్రాంట్ కూడా లభిస్తుంది.

Woman Gang-Raped: ఫంక్షన్ కోసం పిలిచి మహిళపై రైల్వే సిబ్బంది అత్యాచారం

ఐఐటీలు, ఐఐఎమ్‌ల నుంచి సపోర్ట్ కూడా లభిస్తుంది. దేశానికి ఉపయోగపడే అనేక టెక్నాలజీలను ప్రోత్సహించేందుకు కూడా స్టార్టప్‌లు ఉపయోగపడుతున్నాయి. వ్యవసాయం, రక్షణ రంగంలోనూ స్టార్టప్‌లను కేంద్రం ప్రోత్సహిస్తోంది. ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఈ స్టార్టప్‌లకు కావాల్సిన నిధులు, మౌలిక వనరుల్ని సమకూరుస్తోంది కేంద్రం.