నన్ను చంపండి.. పోలీసుల ముందు మోకరిల్లిన సన్యాసిని..

నన్ను చంపండి.. పోలీసుల ముందు మోకరిల్లిన సన్యాసిని..

ఉత్తర మయన్మార్ పట్టణంలో పోలీసుల ముందు ఒక సన్యాసిని(నన్) తన మోకాళ్లపైకి నిలబడి వేడుకుంటోన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత నెల తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులను కాల్చడం మానేయమంటూ వారిని విజ్ఞప్తి చేస్తోన్న నన్ వీడియో సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది.

మైట్కినా పట్టణంలోని ఒక వీధిలో సోమవారం ఆమె మోకరిల్లినట్లు తెలుస్తోంది, ఇద్దరు పోలీసుల ముందు ఆమె మోకరిల్లింది. నిరసనకారులను బాధించవద్దని, వారిని కుటుంబ సభ్యులలాగా చూడాలని వేడుకుంటూ ఆమె మోకాళ్లపై నిలబడ్డారు. “నిరసనకారులను చంపొద్దు.. నన్ను చంపండి” అంటూ ఆమె వేడుకుంది.

మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం గద్దె దిగలంటూ నిరసనలు సాగుతోండగా.. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు సైన్యం, పోలీసులు విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. రబ్బరు తూటాలతో భాష్పవాయువును ప్రయోగిస్తూ.. నిరసనకారులపై విరుచుకుపడుతున్నారు. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి జరుగుతోన్న హింసాత్మక ఘటనల్లో 60మంది చనిపోగా.. 18వందల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యాంగాన్ సిటీలో జరిగిన ఘటనల్లో సన్యాసిని తనముందే నిరసనకారుడిని పోలీసులు తలపై కాల్చి చంపడం చూసి చలించిపోయింది. రక్తమోడుతూ వ్యక్తి చనిపోగా తట్టుకోలేకపోయింది ఆమె. సిస్టర్ యాన్ రోజ్ అనే నన్‌తో పాటు మరో ఇద్దరు నన్స్ కూడా ఇలాగే వేడుకున్నారు.