Nupur sharma gets relief by SC: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల కేసులో నుపుర్ శర్మకు ఊరట

ఓ టీవీ చర్చా కార్యక్రమంలో భాగంగా నుపుర్ మాట్లాడుతూ మహ్మద్ ప్రపక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి వ్యతిరేకత కారణంగా బీజేపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాగా, కొద్ది రోజుల క్రితం ఉదయ్‭పూర్‭లో దర్జీ కన్నయ్య లాల్ హత్యకు ఆమె వ్యాఖ్యలే కారణమని కోర్టు కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించింది. ఆమె వ్యాఖ్యలు దేశంలో దురదృష్టకర సంఘనలకు దారి తీశాయని పేర్కొంది

Nupur sharma gets relief by SC: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల కేసులో నుపుర్ శర్మకు ఊరట

Nupur sharma gets relief by SC

Nupur sharma gets relief by SC: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర నిరసనను ఎదుర్కోవడమే కాకుండా పార్టీ నుంచి సస్పెన్షన్, కోర్టులో కేసులతో సతమతమవుతున్న నుపుర్ శర్మకు ఊరట లభించింది. ఆమెపై నమోదైన 10 కేసులపై విచారణను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలిచ్చింది. తనపై నమోదైన అన్ని కేసులను ఒకే చోట విచారించే విధంగా ఆదేశాలివ్వాలని నుపుర్ శర్మ చేసుకున్న విజ్ణప్తిని కోర్టు అంగీకరించింది. మొదట ఈ విజ్ణప్తిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ తాజాగా ఆమె ప్రతిపాదనకు అనుగునంగా ఆదేశాలివ్వడం గమనార్హం.

ఓ టీవీ చర్చా కార్యక్రమంలో భాగంగా నుపుర్ మాట్లాడుతూ మహ్మద్ ప్రపక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి వ్యతిరేకత కారణంగా బీజేపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాగా, కొద్ది రోజుల క్రితం ఉదయ్‭పూర్‭లో దర్జీ కన్నయ్య లాల్ హత్యకు ఆమె వ్యాఖ్యలే కారణమని కోర్టు కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించింది. ఆమె వ్యాఖ్యలు దేశంలో దురదృష్టకర సంఘనలకు దారి తీశాయని పేర్కొంది. అనంతరం టీవీ ద్వారా ఆమె దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.

ఈ డిబేట్‭ను హోస్ట్ చేసిన టైమ్స్ నౌ సీనియర్ జర్నలిస్ట్ నవిక కుమార్‭పై సైతం పలు కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ కేసులో ఆమెకు కాస్త ఊరట లభించింది. అరెస్ట్ చేయకుండా సోమవారం సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. ప్రస్తుతానికి అయితే అరెస్ట్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ఆగస్టు 10 వరకు అరెస్ట్ చేయకుండా నుపుర్ శర్మకు కోర్టు రక్షణ కల్పించింది. అయితే కేసు ఢిల్లీ కోర్టుకు బదిలీ అవుతుండడంతో దీనిపై ఢిల్లీ కోర్టే తీర్పు వెలువరించనుంది.

10 interesting points about nitish kumar: నితీష్ కుమార్ గురించి 10 ఆసక్తికర అంశాలు