Nusrat Jahan-Nikhil Jain Wedding: నటి నుస్రత్ జహాన్-నిఖిల్ జైన్ వివాహం చెల్లదు : కోర్టు సంచలన తీర్పు

బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్‌ జహాన్‌, నిఖిల్‌ జైన్‌ల పెళ్లి చట్టబద్ధంగా చెల్లదని కోల్ కతా కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

Nusrat Jahan-Nikhil Jain Wedding: నటి నుస్రత్ జహాన్-నిఖిల్ జైన్ వివాహం చెల్లదు : కోర్టు సంచలన తీర్పు

Nusrat Jahan Nikhil Jains Wedding Not Legally (1) (1)

nusrat jahan nikhil jains wedding not legally : బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్‌ జహాన్‌, నిఖిల్‌ జైన్‌ల పెళ్లి చట్టబద్ధంగా చెల్లదని బుధవారం (నవంబర్ 17,2021) కోల్‌కతా కోర్టు తీర్పునిచ్చింది. గతంలో జరిగిన వివాహం చెల్లదని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె అఫిడవిట్‌ను ఎలా పరిగణిస్తారని బీజేపీ కోర్టులో పిటీషణ్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పు ప్రకటించింది. వీరిద్దరూ టర్కీలో వివాహం చేసుకున్నారని..వీరు చేసుకున్న మతాంతర వివాహం భారతదేశంలో నమోదు కాలేదని..కాబట్టి వారి వివాహం చట్టబద్దంగా చెల్లదని కోర్టు తన తీర్పులో వెల్లడించింది.

లోక్‌సభ అఫిడవిట్‌లో నుస్రత్ జహాన్ తాను చట్టబద్ధంగా వివాహం చేసుకున్నానని పేర్కొన్నారు. టీఎంసీ ఎంపీ నుస్రత్ కూడా నిఖిల్‌తో తన వివాహం టర్కీ చట్టం ప్రకారం జరిగిందని..అందువల్ల భారతదేశంలో చెల్లుబాటు కాదని ప్రకటించారు. భారతదేశంలో తమ వివాహం చెల్లదని నుస్రత్ జహాన్ పేర్కొన్న అనంతరం పెళ్లిని రిజిస్టర్ చేయమని నుస్రత్‌ను పదే పదే అభ్యర్థించానని..అయితే ఆమె తన అభ్యర్థనలన్నింటినీ తోసిపుచ్చిందని నిఖిల్ వాపోయారు.

2020 నవంబరు నుంచి తాము విడిపోయామని నిఖిల్ జైన్ చెప్పారు. నుస్రత్ జహాన్, నిఖిల్ జైన్ కొంతకాలం డేటింగ్ తర్వాత..టర్కీలో ఒక వేడుకలో 2019జూన్ 19న పెళ్లి చేసుకున్నారు. తర్వాత కోల్‌కతాలో రిసెప్షన్‌ నిర్వహించారు. ఈ తరువాత ఈ జంట విడిపోయారు. అప్పటికే నుస్రత్ గర్భవతిగా ఉన్నారు.వారు విడిపోయాక 2021 ఆగస్ట్ 26న నుస్రత్ జహాన్ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు యిషాన్ అనే పేరు పెట్టారు. నుస్రత్ కుమారుడు ఇషాన్ జనన ధృవీకరణ పత్రంలో తండ్రి పేరును నుస్రత్ యష్ దాస్‌గుప్తా నమోదు చేయించారు.

ఇదిలా ఉందడగా..లోక్‌సభ అఫిడవిట్‌లో..నుస్రత్ జహాన్ తాను చట్టబద్ధంగా వివాహం చేసుకున్నానని పేర్కొన్నారు. టర్కీలోని బోడ్రమ్‌లో 19/06/2019న జరిగిన వివాహం చట్టబద్ధంగా చెల్లుబాటు కాదని ప్రకటించారని అలీపూర్ 2వ కోర్టు సివిల్ జడ్జి ఎస్ రాయ్ తెలిపారు. వారిద్దరూ వివాహం చేసుకోలేదని కోర్టును ప్రకటించాలని జైన్ కోర్టులో దావా వేశారు. తాను నుస్రత్ జహాన్ బంధువులు, సన్నిహితులతో కలిసి వివాహ వేడుకను జరుపుకున్నామని జైన్ అంగీకరించడాన్ని గమనించిన కోర్టు.. పాశ్చాత్య భారతీయ శైలిలో గానీ..హిందూ వివాహ ఆచారాలను అనుసరించిగానీ వీరి వివాహం టర్కీలో నమోదు కాలేదని పేర్కొంది.

భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి ఉన్నా..నుస్రత్ జహాన్ వివాహాన్ని కొనసాగించడానికి ఇష్టపడలేదని నిఖిల్ జైన్ తెలిపారు. వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రత్యేక వివాహ చట్టం కింద తమ వివాహాన్ని నమోదు చేసుకోలేదు. కాగా, దావాలోని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వివాహం చట్టబద్ధంగా చెల్లుబాటు కాదని కోర్టు అభిప్రాయపడింది.నుస్రత్ వారి వివాహ వేడుకల ఫోటోలను నిఖిల్‌ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. కానీ నుస్రత్ కోర్టు తీర్పు అనంతరం ఆ ఫోటోలను పూర్తిగా తొలగించింది.