నిహారికకు ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అంటున్న విజయ్ సేతుపతి..

నిహారికకు ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అంటున్న విజయ్ సేతుపతి..

O ManchiRoju Chusi Chepta: ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, ‘మెగా ప్రిన్సెస్’ నిహారిక కొణిదెల జంటగా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో రూపొంది తమిళనాట విజయవంతం అయిన సినిమా.. ‘ఒరు నల్ల నాల్ పాతు సోల్రెన్’.. ఈ చిత్రాన్ని తెలుగులో ‘‘ఓ మంచి రోజు చూసి చెప్తా’’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు.

O ManchiRoju Chusi Chepta

శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ రావూరి వెంకటస్వామి ఈ చిత్రం తెలుగు హక్కులను భారీ మొత్తానికి సొంతం చేస్తున్నారు. ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ మూవీని మార్చి 19న విడుదల చేస్తున్నారు.

O ManchiRoju Chusi Chepta

ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ.. ‘‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది. విజయ్ సేతుపతి గారి నటన ఈ చిత్రానికే హైలైట్. నిహారిక కొణిదెల ఎప్పుడు చేయని పాత్రలో కనిపిస్తారు. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. తెలుగు ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ చిత్రాన్ని మార్చి 19 న భారీగా విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు.