దామూ నేనే, సోమూ నేనే.. అంటున్న ‘మక్కల్ సెల్వన్’..

దామూ నేనే, సోమూ నేనే.. అంటున్న ‘మక్కల్ సెల్వన్’..

OMRCC Teaser: ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, ‘మెగా ప్రిన్సెస్’ నిహారిక కొణిదెల, యంగ్ హీరో గౌతమ్ కార్తీక్ ప్రధాన పాత్రధారులుగా నటించిన తమిళ్ మూవీ ‘ఒరు నల్ల నాల్ పాతు సోల్రెన్’.. ఆరుముగా కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘‘ఓ మంచి రోజు చూసి చెప్తా’’ పేరుతో విడుదల చేస్తున్నారు.

శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ రావూరి వెంకటస్వామి ఈ చిత్రం తెలుగు హక్కులను భారీ మొత్తానికి సొంతం చేస్తున్నారు. ఇటీవల ఫస్ట్‌లుక్ పోస్టర్లు రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా టీజర్ వదిలారు.

 OMRCC

దాము విలనా, సోము విలనా అనే తికమకతో ఉండగా.. దామూ నేనే, సోమూ నేనే అని విజయ్ సేతుపతి చెప్పడం ఆసక్తికరంగా అనిపించింది.. గాయత్రీ శంకర్, విజి చంద్రశేఖర్, రమేష్ తిలక్ తదితరులు నటించిన ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ మార్చి 19న ప్రేక్షకుల ముందుకురానుంది..

 OMRCC