స్కూల్ పిల్లోడి కోసం బస్ టైమింగ్ మార్పు, రవాణా శాఖపై నెటిజన్ల ప్రశంసలు

స్కూల్ పిల్లోడి కోసం బస్ టైమింగ్ మార్పు, రవాణా శాఖపై నెటిజన్ల ప్రశంసలు

Odisha boy appeals : సార్, రోజు వెళ్లే బస్ టైమింగ్ మార్చారు. దీంతో స్కూల్ కు వెళ్లే సరికి చాలా ఆలస్యమౌతోంది. దీనివల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నా..ప్లీజ్ సార్..బస్సు యదావిధిగా వచ్చేటట్లు చేయండి సార్ అని ఓ స్కూల్ పిల్లోడి పెట్టుకున్న అభ్యర్థనకు రవాణా శాఖ వేగంగా స్పందించింది. వెంటనే ఆ విద్యార్థికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా..బస్సు యదావిధిగా వచ్చేట్లు టైమింగ్ మార్చారు. ఆ విద్యార్థి ట్టిట్టర్ వేదికగా చేసిన ట్వీట్..వైరల్ గా మారింది. నెటిజన్లు రవాణా శాఖను అభినందిస్తున్నారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది.


లింగిపూర్ లో నివాసం ఉంటున్న సాయి అన్వేష్ (Sai Anwesh A. Pradhan) భువనేశ్వర్ లోని ఎంబీఎస్ పాఠశాలలో చదువుకుంటున్నాడు. ఇతనికి ట్విట్టర్ అకౌంట్ ఉంది. స్కూల్ కు ఉదయం 7.30 కల్లా చేరుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజు రూట్ నెంబర్ 13 బస్సు ఎక్కి స్కూల్ కు వెళ్లేవాడు. కానీ..ఈ బస్సు టైమింగ్ మార్చారు. దీనికారణంగా..స్కూల్ కు వెళ్లే సరికి 7.40 అవుతోందని, దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ…క్యాపిటల్ రీజనల్ అర్బర్ ట్రాన్స్ పోర్ట్ భువనేశ్వర్ (@CRUT_BBSR,
@arunbothra) పేరిట ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని గమనించి తొందరగా చర్యలు తీసుకోవాలని విద్యార్థి అన్వేష్ ట్వీట్లు చేశాడు.

ఈ ట్వీట్ ను సీఆర్ యూటీ ఎండీ అరుణ్ బోత్రా చూశారు. వెంటనే చర్యలు తీసుకుంటున్నామని, సోమవారం నుంచి బస్ టైమ్స్ మారుస్తున్నామని తెలిపారు. మీ లాంటి ప్రయాణీకులను ఎంవో బస్ ప్రేమిస్తుందని, మొదటి బస్ 07.00 గంటలకే ప్రారంభమౌతుందని, స్కూల్ కు లేట్ గా వెళ్లడం అవదని సమాధానమిచ్చారు. విద్యార్థి చేసిన విజ్ఞప్తికి అరుణ్, ఒడిశా రవాణా శాఖ స్పందించడం పట్ల..నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు.