అయ్యబాబోయ్..! టీ స్టాల్ వ్యాపారికి రూ.109 కోట్ల GST కట్టాలంటూ నోటీసులు

అయ్యబాబోయ్..! టీ స్టాల్ వ్యాపారికి రూ.109 కోట్ల GST కట్టాలంటూ నోటీసులు

Odisha : Tea Stall woner Served Rs. 109 Crore GST Notice : ప్రతీ రోజు తెల్లవారుఝాములనే లేచి టీ కాచి అమ్ముకుంటేనే గానీ రోజు గడవని ఓ చిరు వ్యాపారికి జీఎస్టీ అధికారుల ఝలక్ ఇచ్చారు. రెక్కాడితే డొక్కాడని జీవికి ఏకంగా రూ.109 కోట్ల రూపాయల పన్ను బకాయి పడ్డావు..వెంటనే కట్టాలంటూ నోటీసు పంపించి షాక్ ఇచ్చారు. తనకు వచ్చిన నోటీసు ఏమిటో కూడా తెలియని అమాయికుడు ఆ చిరు వ్యాపారి. సంతకం పెట్టటం కూడా రాని ఆ వ్యాపారికి నోట మాటరాలేదు.

వివరాల్లోకి వెళితే ఒడిశాలోని ద్రవ్య సేవా పన్ను(జీఎస్‌టీ) బకాయిలు పడిన వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ చిన్న టీ స్టాల్ పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకంటున్న టీకొట్టు వ్యాపారికి జీఎస్‌టీ బకాయి కింద రూ.109 కోట్లు జమ చేయాలని నోటీసులు పంపించారు.

ఒడిశాలోని రౌర్కెలా కోయల్‌నగర్‌ ప్రాంతంలో టీకొట్టు వ్యాపారి కార్తీక్‌ కమిల రూ.109 కోట్ల జీఎస్‌టీ చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. కార్తీక్‌ కు ఏదో నోటి లెక్కలతో వ్యాపారాన్ని సాగిస్తుంటాడు. పొట్టకోస్తే అక్షరం ముక్కరాదు.కనీసం సంతకం చేయం కూడా రాదు. కానీ కార్తీక్ ఓ బడా షాపింగ్‌మాల్‌ యజమానిగా జీఎస్‌టీ వర్గాలు నోటీసులో పేర్కొన్నాయి. ఒప్పంద పత్రాల సంతకాలతో ఓ షాపింగ్ మాల్ అద్దెకు నడుపుతున్నాడని ఆ నోటీసులో ఉంది.

కార్తీక్‌ రౌర్కెలా కోయల్‌నగర్‌ లింగరాజ్‌ ట్రేడింగ్‌ కంపెనీ షాపింగ్‌మాల్‌ ఆవరణలో టీకొట్టు నడుపుకుంటున్నాడు. అలాగే పక్కన కూరగాయలు కూడా అమ్ముతుంటాడు. ఈ చిరు వ్యాపారంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.అటువంటి కార్తీక్ ఓ బడా ట్రేడింగ్‌ కంపెనీ యజమానిగా..పెద్ద షాపింగ్ మాల్ యజమానిగా భావించారు జీఎస్టీ అధికారులు. ఆ షాపింగ్ మాల్ ను కార్తీక్ అద్దెకిచ్చాడని దానికి సంబంధించి రూ.109 కోట్లు జీఎస్టీ కట్టాలని నోటీసులు జారీ చేశారు.

తనకు వచ్చిన నోటీసులు తెలిసినవారికి చెప్పగా ఈ విషయం తెలిసింది కార్తీక్ కు. దీంతో తనకు కనీసం సొంత ఇల్లు కూడా లేదని..టీలు అమ్ముకుని బతుకుతున్నాననీ నేను రూ.109 కోట్లు బకాయి పడటమేంటంటూ హడలిపోయాడు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా..జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని నియమించి గత బుధవారం (డిసెంబర్16,2020) విచారణ చేపట్టింది.

ఈ విచారణలో అధికారులు పలు అంశాలను సమీక్షించడంతో నోటీసులు బూటకమని తేలింది. కార్తీక్‌ తన టీ స్టాల్ కు కట్టే విద్యుత్‌ బిల్లులు దాఖలు చేసి..ఇటువంటి ఫేక్ జీఎస్‌టీ నోటీసులు జారీ చేయించినట్లు భావిస్తున్నారు.

కాగా…గతంలో కూడా ఇటవంటి నోటీసులకే జారీ అయ్యాయి. ఆటో డ్రైవర్లు, రోజువారీ కూలీలు, విద్యార్థులు, చిరు వ్యాపారులకు జీఎస్‌టీ అధికారులు నోటీసులు జారీ చేసారు. తరువాత వారి పొరపాట్లు గ్రహించి మిన్నకుండిపోయారు.