రైతులకు మద్దతుగా..రహదారిపై విగ్రహాలతో శిల్పి నిరసన

రైతులకు మద్దతుగా..రహదారిపై విగ్రహాలతో శిల్పి నిరసన

Odisha’s Muktikant Biswal : ఢిల్లీలో రైతుల ఆందోళన ఇంకా కొనసాగుతోంది. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ..ఢిల్లీ సరిహద్దులో భారీ ఎత్తున్న రైతులు నిరసనలు చేపడుతున్నారు. వీరు చేపడుతున్న ఆందోళనలకు పలువురు మద్దతు తెలియచేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా…ఒడిశా రాష్ట్రానికి చెందిన శిల్పి ముక్తికాంత్ బిశ్వాస్ వినూత్న పద్ధతిలో నిరసన తెలియచేస్తున్నారు. 17 రోజుల పాటు సైకిల్ నడుపుకుంటూ..ఒడిశా నుంచి ఘాజిపూర్ సరిహద్దుకు చేరుకున్నారు. అనంతరం జాతీయ రహదారిపై మట్టి విగ్రహాలు తయారు చేస్తూ..వినూత్న పద్ధతిలో తన నిరసనను వ్యక్తం చేశారు.

రైతుల దోపిడి ప్రతీకగా ఈ విగ్రహాలు తయారు చేయడం విశేషం. మూడు విగ్రహాల్లో ఇద్దరు రైతులు నాగలి కలిగి ఉన్నారు. మరొక విగ్రహం కార్పొరేట్ వ్యాపారం చేస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. ఇతని చేతిలో కొరడా ఉంది. రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియచేస్తున్నట్లు, కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకమన్నారు. జనవరి 29వ తేదీన ఘాజిపూర్ చేరుకున్నట్లు బిశ్వాల్ తెలిపారు. మరిన్ని విగ్రహాలను తయారు చేస్తానన్నారు. గత మూడు నెలలకు పైగా రైతులు ఆందోళన చేపడుతున్నారు. 2020, నవంబర్ 26వ తేదీ నుంచి దేశ రాజధాని సరిహద్దులో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం, రైతు సంఘాల మధ్య 11 రౌండ్ల చర్చలు జరిగాయి. కానీ..ఇప్పటి వరకు ఏకాభిప్రాయం రాలేదు. మరోసారి చర్చలు జరిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.