Odisha: మహిళల భద్రతా విషయంలో ఒడిశా చెత్త రికార్డ్

మూడు నెలలుగా 15ఏళ్ల బాలికపై పలు మార్లు లైంగికదాడి జరిపిన ఘటన.. మార్చి చివరి వారంలో వెలుగు చూసింది. ఒక పోల్ కు కట్టేసి ఆమెపై దాడికి పాల్పడినట్లు తెలిసి బాధితురాలి తండ్రి..

Odisha: మహిళల భద్రతా విషయంలో ఒడిశా చెత్త రికార్డ్

Odisha

Odisha: మూడు నెలలుగా 15ఏళ్ల బాలికపై పలు మార్లు లైంగికదాడి జరిపిన ఘటన.. మార్చి చివరి వారంలో వెలుగు చూసింది. ఒక పోల్ కు కట్టేసి ఆమెపై దాడికి పాల్పడినట్లు తెలిసి బాధితురాలి తండ్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి మొరపెట్టుకున్నాడు. దీనిపై రియాక్ట్ అయిన స్థానిక సర్పంచ్ ఏ మాత్రం జోక్యం చేసుకోవడానికి ముందుకురాలేదు.

ఒడిశాలోని నయాగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళల పట్ల, పిల్లల పట్ల దాడులు వరుసగా నమోదవుతూనే ఉన్నాయి. 2020లో మైనర్ బాలిక రేప్, హత్య రచ్ఛగా మారినా.. పోలీసులు కీలకమైన ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ను సంపాదించలేకపోయారు.

బాధితురాలి తల్లిదండ్రులు న్యాయం కావాలంటూ రాష్ట్ర అసెంబ్లీ ముందు ఆత్మహత్యాయత్నం జరిపిన తర్వాత మాత్రమే ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కొంతమంది ప్రభావవంతమైన రాజకీయ నాయకులు, BJD ప్రభుత్వ మంత్రులు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ ఏ మాత్రం పరిష్కారం దొరకలేదు.

Read Also: ఒడిశా నది ఒడ్డున మనిషి పుర్రెలు..! నరబలులా? క్షుద్రపూజలా?!!

ఈ ఘటన కంటే ముందు సుందర్‌ఘర్ జిల్లాలో ప్రధానోపాధ్యాయుడి లైంగిక వేధింపుల కారణంగా 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది.

ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, బాలికల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో 2021కి గానూ 11శాతం రేప్ కేసులు పెరిగినట్లు వివరించారు. 2018 నుంచి 2021 వరకూ చూస్తే సంఖ్య 32శాతం పెరిగిందట. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం.. ఈ కేటగిరీలో ఒడిశా టాప్ లిస్టులో ఉందట. చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడుల సంఖ్యలోనూ పెరుగుదల కనిపిస్తూనే ఉంది.

ఒడిశా పోలీసులు చట్టాన్ని అమలు చేయడంలో భయపడుతున్నారు. మహిళా సాధికారత కారణాన్ని సమర్థిస్తున్న అధికార ప్రభుత్వం అప్రమత్తం చేయాల్సి ఉంది.