Mumbai: గోడలు బద్దలుకొడితే వెండి ఇటుకలు, నోట్ల కట్టలొచ్చాయి..

గోడలు బద్దలు కొడితే ఏమొస్తాయి ఇటుకలొస్తాయి. ఒకవేళ పాతకాలం నాటి గోడలైతే సున్నం వస్తుంది. కానీ ముంబయిలోని ఓ వ్యాపారి సంస్థ కార్యాలయంలో గోడలు బద్దలు కొడితే ఇటుకలు, సున్నంకు బదులు...

Mumbai: గోడలు బద్దలుకొడితే వెండి ఇటుకలు, నోట్ల కట్టలొచ్చాయి..

Crime News

Mumbai: గోడలు బద్దలు కొడితే ఏమొస్తాయి ఇటుకలొస్తాయి. ఒకవేళ పాతకాలం నాటి గోడలైతే సున్నం వస్తుంది. కానీ ముంబయిలోని ఓ వ్యాపారి సంస్థ కార్యాలయంలో గోడలు బద్దలు కొడితే ఇటుకలు, సున్నంకు బదులు డబ్బుల కట్టలు, వెండి ఇటుకలు బయటకొచ్చాయి. వీటిని చూసి నివ్వెరపోవటం అధికారులవంతైంది. అసలు విషయానికివస్తే.. ఇటీవల అనుమానిత కంపెనీల లావాదేవీలను పరిశీలించిన మహారాష్ట్ర జీఎస్‌టీ అధికారులు చాముండా బులియన్ టర్నోవర్ గత మూడేళ్లలో రూ. 23 లక్షల నుంచి రూ. 1,764 కోట్లకు పెరగడాన్ని గుర్తించారు. దీంతో కల్బాదేవి సహా మూడు ప్రాంతాల్లో ఉన్న ఆ సంస్థ కార్యాలయాలపై గత బుధవారం దాడులు నిర్వహించారు.

Crime news : ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన ఇల్లాలు.. మూడ్నెళ్ల తరువాత వీడిన మిస్టరీ.. ఎలా దొరికారంటే?

ఈ దాడుల్లో ఓ గదిలో నేలపై ఏర్పాటు చేసిన టైల్స్‌ను అధికారులు మరింత నిశితంగా పరిశీలించగా ఓ మూలన టైల్స్ ఎత్తుగా కనిపించాయి. దీంతో అనుమానంతో ఆ టైల్స్‌ను తొలగించి చూడగా గోనె సంచులు కనిపించాయి. వాటిని బయటకు తీసి చూడగా అందులో డబ్బు కట్టలు కనిపించాయి. అయితే అవి ఎక్కడ నుంచి వచ్చాయో తమకు తెలియదని కుటుంబ సభ్యులు చెప్పడం గమనార్హం. డబ్బుల కట్టలు దొరికిన విషయాన్ని ఆదాయపు పన్ను అధికారులకు జీఎస్టీ అధికారులు సమాచారం అందించారు. వారొచ్చి భవనంలో మిగిలిన గదులను కూడా పరిశీలించారు. అనుమానం వచ్చి గోడను బద్దలు కొట్టగా అందులో నుంచి డబ్బుల కట్టలు, వెండి ఇటుకలు బయటకొచ్చాయి. నివ్వెర పోవటం అధికారుల వంతైంది. మిగిలిన గదులను అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే సోదాల్లో మొత్తం రూ. 10కోట్ల విలువైన సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.13లక్షల విలువగల 19 కేజీల వెండి ఇటుకలు, రూ. 9.8 కోట్ల నగదుగా అధికారులు వెల్లడించారు.