Kargil Vijay Divas : నేడు విజయ్‌ దివస్‌..కార్గిల్‌ యుద్ధానికి నేటితో 23 ఏళ్లు

కార్గిల్‌ యుద్ధంలో భారత్ విజయానికి నేటితో 23 ఏళ్లు. ఈ సందర్భంగా ప్రతియేటా నిర్వహించే విజయ్ దివస్‌ సంస్మరణ దినోత్సవాన్ని... లద్దాఖ్‌లోని కార్గిల్ వార్‌ మెమోరియల్ వద్ద నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది కూడా అమర వీరుల త్యాగాలను స్మరించుకునేందుకు భారత్ రెడీ అయింది. దేశవ్యాప్తంగా సాయుధ బలగాలతోపాటు ప్రజలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.

Kargil Vijay Divas : నేడు విజయ్‌ దివస్‌..కార్గిల్‌ యుద్ధానికి నేటితో 23 ఏళ్లు

Vijay Divas

Kargil Vijay Divas : కార్గిల్‌ యుద్ధంలో భారత్ విజయానికి నేటితో 23 ఏళ్లు. ఈ సందర్భంగా ప్రతియేటా నిర్వహించే విజయ్ దివస్‌ సంస్మరణ దినోత్సవాన్ని… లద్దాఖ్‌లోని కార్గిల్ వార్‌ మెమోరియల్ వద్ద నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది కూడా అమర వీరుల త్యాగాలను స్మరించుకునేందుకు భారత్ రెడీ అయింది. దేశవ్యాప్తంగా సాయుధ బలగాలతోపాటు ప్రజలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.

1999లో కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు దాయాది పాకిస్తాన్ కుట్రలు పన్నింది. వాటిని భారత సైన్యం పటాపంచలు చేసింది. ఆపరేషన్ విజయ్ పేరుతో భారత సైన్యం సైనిక చర్యను ప్రారంభించింది. పాక్ సైన్యం ఆక్రమించుకున్న పర్వత శిఖరాలను భారత సైన్యం తిరిగి చేజిక్కించ్చుకుంది. మూడు నెలల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది.

Kargil Vijay Diwas: ‘ఆపరేషన్‌ విజయ్‌’ పేరుతో పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పిన భారత్ సైన్యం.. ఆ యుద్ధం గురించి 11 విషయాలు..

ఆ విజయాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది జూలై 26ను విజయ్ దివస్ గా జరుపుకుంటున్నాం. విజయ్‌ దివస్‌ కోసం లఢబ్‌లోని ద్రాస్‌లో ఉన్న కార్గిల్‌ వార్‌ మెమోరియల్‌ వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో సైనికుల త్యాగాలకు గుర్తుగా క్యాండిల్స్‌ వెలిగించి ప్రజలు నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది.