Live-in relation: 20 ఏళ్లుగా వృద్ధజంట సహజీవం.. గ్రామప్రజలంతా కలిసి..

ఆయన వయసు 60.. ఆమెకి 55 ఏళ్ళు.. ఇద్దరూ కలిసి ఇరవై ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఈ ఇద్దరూ అదే ఊళ్ళోనే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇరవై ఏళ్ల సహజీవనానికి గుర్తుగా వీరికి 13 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఈ ఇరవై ఏళ్లుగా ఊళ్ళో ప్రజలు.. ఇరుగుపొరుగు వారు ఎన్నో మాటలతో నిందించారు. అయినా ఈ జంట వినలేదు.

Live-in relation: 20 ఏళ్లుగా వృద్ధజంట సహజీవం.. గ్రామప్రజలంతా కలిసి..

Live In Relation

Live-in relation: ఆయన వయసు 60.. ఆమెకి 55 ఏళ్ళు.. ఇద్దరూ కలిసి ఇరవై ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఈ ఇద్దరూ అదే ఊళ్ళోనే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇరవై ఏళ్ల సహజీవనానికి గుర్తుగా వీరికి 13 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఈ ఇరవై ఏళ్లుగా ఊళ్ళో ప్రజలు.. ఇరుగుపొరుగు వారు ఎన్నో మాటలతో నిందించారు. అయినా ఈ జంట వినలేదు. ఇలా పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండడం పద్ధతి కాదని.. పెళ్లి చేసుకోవాలని ఎంత చెప్పినా ఈ జంట మాత్రం వినలేదు.

దాంతో ఊళ్ళో పెద్దలు మాట్లాడుకొని పట్టుబట్టి పెళ్లి ఖర్చు కూడా వాళ్ళే భరించి చివరికి ఈ వృద్ధ జంటకి పెళ్లి చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లా మొరాదాబాద్​లో ఈ పెళ్లి జరిగింది. 60 ఏళ్ల నారాయణ్ రాయ్​దాస్, 55 ఏళ్ల రామ్​రతీ 2001 నుంచి కలిసి ఉంటూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వారికి 13 ఏళ్ల అజయ్ ఉండగా అతను కూడా వీరితోనే కలిసి ఉంటున్నాడు. ఇన్నేళ్లలో ఊళ్ళో వాళ్ళు ఎన్ని చెప్పినా ఈ జంట పెళ్లి చేసుకోలేదు.

అయితే.. ఈసారి కుమారుడికి అవమానం, అపనిందలు రాకూడదంటే వారిద్దరూ పెళ్లి చేసుకోవాల్సిందేనని గ్రామపెద్ద రమేశ్​తో పాటు సామాజిక కార్యకర్తలు ఒప్పించారు. పెళ్లికయ్యే ఖర్చులన్నీ తామే భరిస్తామని హామీ కూడా ఇవ్వడంతో వారు పెళ్లికి ఒప్పుకున్నారు. సామజిక కార్యకర్తలు ఒప్పించిన పెళ్లి కదా అని ఏదో తూతూ మంత్రంగా జరిపించలేదు. ఊరి ప్రజలంతా చందాలేసుకొని మరీ గ్రాండ్ గా వీరి పెళ్లి జరిపించారు. డీజే పాటల ధూంధాం మధ్యలో వారి వివాహం ఘనంగా నిర్వహించారు.