Old Currency : ఆన్ లైన్ లో పాతకరెన్సీ వ్యాపారం…. హెచ్చరికలు జారీచేసిన ఆర్ బి ఐ

ఆన్ లైన్ ప్రచారంతో నిజమేనని నమ్మి చాలా మంది ప్రజలు మోసగాళ్ళ వలలో చిక్కి మోసపోతున్నారు. చాలా కాలంగా ఈ వ్యవహారం సాగుతున్నా ఆర్ బిఐ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు.

Old Currency : ఆన్ లైన్ లో పాతకరెన్సీ వ్యాపారం…. హెచ్చరికలు జారీచేసిన ఆర్ బి ఐ

Old Curency (1)

Old Currency : పురాతనమైన నాణెలు, నోట్లు ప్రస్తుతం భలే గిరాకీ పలుకుతున్నాయి. నోట్లు, నాణెముల కలెక్షన్ ను హాబీగా పెట్టుకున్న వారు పురతానమైన నాణెలు, నోట్లను కొనుగోలు చేసేందుకు ఎంత డబ్బైనా వెచ్చించేందుకు వెనుకాడటంలేదు.

ప్రస్తుతం ఈ తరహా వ్యాపారం ఆన్ లైన్ లో జోరుగా సాగుతుంది. పురాతన నాణెలు, నోట్లు కొనుగోలు చేస్తామంటూ ఆన్ లైన్ లో ఇబ్బడి ముబ్బడిగా ప్రచారం చేసుకుంటున్నారు. కొన్ని వెబ్ సైట్లు ఒకడుగు ముందుకు వేసి తాము నిర్వహిస్తున్న పాత నోట్ల కొనుగోలు వ్యాపారానికి ఆర్ బి ఐ అనుమతి ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు.

ఆన్ లైన్ ప్రచారంతో నిజమేనని నమ్మి చాలా మంది ప్రజలు మోసగాళ్ళ వలలో చిక్కి మోసపోతున్నారు. చాలా కాలంగా ఈ వ్యవహారం సాగుతున్నా ఆర్ బిఐ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. అయితే తాజాగా ఈ తరహా మోసాలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఆర్ బి ఐ రంగంలోకి దిగింది.

పాతనోట్లు, నాణ్యాల వ్యాపారంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎలాంటి సంబంధంలేదని ప్రకటించింది. ఆర్ బిఐ పేరుతో లోగోను దుర్వినియోగం చేస్తూ కొన్ని ఆన్ లైన్ సంస్ధలు పాతనోట్లు, నాణెముల క్రయ, విక్రయాలు సాగిస్తూ చార్జీలు, కమిషనల్ వసూలు చేస్తూ మోసగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఇలాంటి మోసగాళ్ళ బారిన పడొద్దని ప్రజలను హెచ్చరించింది.

ఈ తరహాలో ఆన్ లైన్ లో నోట్లు, నాణెముల కొనుగోలుకు ఆర్ బి ఐ ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదని స్పష్టం చేసింది. ప్రజలు జాగ్రత్తతో మెలగాలని మోసగాళ్ళ వలో చిక్కుకుని డబ్బును పోగొట్టుకోవద్దని కోరింది.