Old Man Reached Home: తుపాన్‌ సమయంలో తప్పిపోయి.. 23ఏళ్ల తరువాత ఇంటికి చేరిన వృద్ధుడు.. కొడుకులు ఏం చేశారంటే..

బెంగాల్ రేడియో క్లబ్ కృతిచంద్ర కుటుంబం ఆచూకీని కనుగొనేందుకు ప్రయత్నించింది. ఎట్టకేలకు పాటిగ్రామ్‌లో బరాల్ కుటుంబం ఉన్నట్లు గుర్తించారు. బరాల్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. మీ తండ్రి బతికే ఉన్నట్లు వారికి సమాచారం ఇచ్చారు.

Old Man Reached Home: తుపాన్‌ సమయంలో తప్పిపోయి.. 23ఏళ్ల తరువాత ఇంటికి చేరిన వృద్ధుడు.. కొడుకులు ఏం చేశారంటే..

Old Man missing Case

Old Man Reached Home: ఒడిశాకు చెందిన కృతిచంద్ర బరాల్ (80) అనే వృద్ధుడు 23ఏళ్ల తరువాత తన కుటుంబ సభ్యుల వద్దకు చేరాడు. బంగాల్ రేడియో క్లబ్ కృతిచంద్ర కుటుంబం ఆచూకీని కనుగొనేందుకు ప్రయత్నిచగా సఫలమైంది. బరాల్ కుటుంబాన్ని పాటిగ్రామ్, బమ్నాల, పూరిలో గుర్తించారు. దీంతో అతని కుటుంబ సభ్యులు వచ్చి వృద్ధుడిని ఇంటికి తీసుకెళ్లారు. కృతిచంద్ర బరాల్ 1999 సంవత్సరంలో ఒడిశా తీరాన్ని చుట్టుముట్టిన సైక్లోన్ సమయంలో తప్పిపోయాడు. ఆ సమయంలో 10వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. బరాల్ మాత్రం మతిస్థిమితం కోల్పోయి విశాఖ పరిసర ప్రాంతాలకు చేరుకున్నాడు.

Tirupati Missing Students : తిరుపతిలో అదృశ్యం, యూపీలో ప్రత్యక్షం.. ఆ ఐదుగురు 10వ తరగతి పిల్లల ఆచూకీ లభ్యం

విశాఖపట్టణం ఓడరేవుకు చేరుకున్న బరాల్ అక్కడే ఫుట్‌పాత్‌పై జీవనం సాగించడం మొదలు పెట్టాడు. అక్కడివారు ఇచ్చే ఫుడ్ ప్యాకెట్లను తింటూ జీవనం సాగించాడు. ఓసారి కృతిచంద్ర బరాల్ తీవ్ర అనారోగ్యంపాలుకావటంతో స్థానికులు గుర్తించి మిషనరీస్ ఆఫ్ ఛారిటీ (ఎంఓసీ)కి అప్పగించారు. అప్పటి నుంచి వృద్ధుడి బాధ్యతలు ఛారిటీని చూసుకుంటుంది. అతని గతం గుర్తుకుతెచ్చేందుకు ప్రయత్నించినా ఉపయోగంలేకపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళంఅనే పదాలను ఎక్కువగా వాడటంతో ఆ పరిసర ప్రాంతాల్లో మిషనరీలతో గ్రామాలకు తీసుకెళ్లేవారు. అయినా ఉపయోగం లేకపోయింది.

Missing Poster Reunited: 9 ఏళ్ల క్రితం కిడ్నాపైన బాలిక.. పక్కనే ఉన్నా ఇళ్లు చేరడానికి ఇన్నేళ్లు పట్టింది

బెంగాల్ రేడియో క్లబ్ కృతిచంద్ర కుటుంబం ఆచూకీని కనుగొనేందుకు ప్రయత్నించింది. ఎట్టకేలకు పాటిగ్రామ్‌లో బరాల్ కుటుంబం ఉన్నట్లు గుర్తించారు. బరాల్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారికి సమాచారం ఇవ్వగా.. వారు బరాల్ వద్దకు వచ్చి కన్నీరుపెట్టుకున్నారు. 1999 తుఫాన్ సమయంలో తప్పియాడని, తరువాత మేం ఎంత వెతికినా కనిపించక పోవటంతో చనిపోయాడని భావించామని కుమారులు తెలిపారు. చనిపోయాడని భావించిన తండ్రి కళ్లెదుటే ఉండటంతో కుమారులు సంతోషంతో బరాల్ ను ఇంటికి తీసుకెళ్లారు.