Cricketer Suspension: సోషల్ మీడియాలో మ‌హిళ‌లపై కామెంట్లు.. క్రికెటర్ సస్పెండ్

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్‌స‌న్‌పై చర్యలు తీసుకుంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్టు. ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) రాబిన్‌స‌న్‌ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది.

Cricketer Suspension: సోషల్ మీడియాలో మ‌హిళ‌లపై కామెంట్లు.. క్రికెటర్ సస్పెండ్

Ollie Robinson suspended from all international cricket

Ollie Robinson: న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్‌స‌న్‌పై చర్యలు తీసుకుంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్టు. ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) రాబిన్‌స‌న్‌ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. ఈ 27 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ 2012 నుండి 2014 వరకు లింగ వివక్ష మరియు జాత్యహంకారానికి సంబంధించిన అనేక ట్వీట్లు చేశాడు. రాబిన్‌స‌న్‌ను జట్టులోకి తీసుకున్న తర్వాత ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. పెరుగుతున్న వివాదాన్ని చూసిన ECB రాబిన్‌స‌న్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

భవిష్యత్తులో ఆటగాళ్లను జట్టులోకి తీసుకునే ముందు ECB వారి సోషల్ మీడియా ఖాతాలను సమీక్షించవచ్చునని ఈ సంధర్భంగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్ గ్రాహం తోర్పే అన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన రాబిన్‌స‌న్ తన తప్పును అర్థం చేసుకుని క్షమాపణలు చెప్పాడు. టెస్ట్ మ్యాచ్ ప్రారంభ రోజు ఆట ముగిసిన వెంటనే, రాబిన్‌స‌న్ ప్రెస్ ముందు క్షమాపణలు చెప్పాడు. ‘నేను గతంలో పెట్టిన మాటలకు చాలా చింతిస్తున్నాను. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడుతున్నాను’ అంటూ క్షమాపణలు చెప్పారు.

ట్విట్టర్‌లో 2012-13 సంవత్సరాల్లో రాబిన్‌స‌న్‌ జాతి వివ‌క్షకు సంబంధించిన, మ‌హిళ‌ల ప‌ట్ల వివ‌క్షాపూరితమైన కామెంట్లు చేశాడంటూ అత‌నిపై చ‌ర్యలు తీసుకున్నారు. అప్ప‌ట్లో రాబిన్‌స‌న్‌ టీనేజ‌ర్ కాగా.. ప్ర‌స్తుతం దీనిపై విచార‌ణ జ‌రుగుతోంది. అది పూర్త‌య్యే వ‌ర‌కూ రాబిన్‌స‌న్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఆడే అవ‌కాశం లేదని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు స్పష్టంచేసింది. లార్డ్స్‌లో న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి టెస్ట్‌లోనే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు రాబిన్‌స‌న్.. తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే 4, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి అధ్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న చేశాడు.

ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కీల‌క‌మైన స‌మ‌యంలో 42 ప‌రుగులు చేసి ఇంగ్లండ్ ప‌రువు నిల‌బెట్టాడు. అసలు మ్యాచ్ డ్రా కావ‌డంలో కీల‌క‌పాత్ర పోషించారు రాబిన్‌స‌న్‌. క్రికెట్ నుంచి సస్పెండ్ చేయ‌డంతో న్యూజిలాండ్‌తో ఈ నెల 10 నుంచి ప్రారంభ‌మ‌య్యే రెండో టెస్ట్‌కు దూరం కానున్నాడు. టీనేజ‌ర్‌గా ఉన్నప్పుడు స‌మ‌యంలో ముస్లిం క‌మ్యూనిటీని ఉగ్ర‌వాదానికి ముడిపెడుతూ ట్వీట్లు చేయ‌డంతోపాటు మ‌హిళ‌ల‌పై, ఆసియా ఖండ ప్ర‌జ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశాడు. తొలి రోజు అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడిన త‌ర్వాత గ‌త బుధ‌వారం ఈ వ్యాఖ్య‌ల‌పై అత‌డు క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పాడు.