Omicron‌ Tension : తెలంగాణకు ఒమిక్రాన్‌ టెన్షన్..విదేశాల నుంచి వచ్చిన 13మందికి కోవిడ్

తెలంగాణను ఒమిక్రాన్‌ వేరియంట్ టెన్షన్ పెడుతోంది. విదేశాల నుంచి వచ్చిన 13మందికి కోవిడ్ పాజిటివ్‌‌గా తేలింది. వారిని టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Omicron‌ Tension : తెలంగాణకు ఒమిక్రాన్‌ టెన్షన్..విదేశాల నుంచి వచ్చిన 13మందికి కోవిడ్
ad

Omicron‌ Tension for Telangana : తెలంగాణను ఒమిక్రాన్‌ వేరియంట్ టెన్షన్ పెడుతోంది. విదేశాల నుంచి వచ్చిన 13మందికి కోవిడ్ పాజిటివ్‌‌గా తేలింది. వారిని టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇవాళ ఒక్క రోజే.. 9 పాజిటివ్ కేసులు నమోదవడం టెన్షన్ పెంచుతోంది. ఈ 13మందీ హైరిస్క్ దేశాల నుంచే వచ్చి వారు కావడంతో.. శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. వాటి రిపోర్టులు వచ్చిన తర్వాతే.. ఒమిక్రాన్ వేరియంటా అనే విషయంపై క్లారిటీ వస్తుంది. ఒకటి రెండ్రోజుల్లో సీసీఎంబీ నివేదిక వచ్చే అవకాశం ఉంది.

హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కరోనా కలకలం రేగింది. విదేశాల నుంచి ఇవాళ 219 మంది హైదరాబాద్‌కు రాగా.. వారిలో 9 మంది ప్రయాణికులకి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక ఇవాళ్టి వరకు మొత్తం 13 కేసులు నమోదయ్యాయి. ఈ 13 మంది శాంపిల్స్‌ను జినోమ్‌ సిక్వెన్స్‌కు పంపారు అధికారులు.

Minister Sabita Indrareddy : మానవత్వం చాటుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి ఎంట్రీ అవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్ పాజిటివ్‌ వచ్చిన వారికి ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు టిమ్స్‌ను సిద్ధం చేసింది. విదేశాల నుంచి వచ్చినవారికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలితే వారిని ఎయిర్ పోర్ట్‌ నుంచి నేరుగా టిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తారు.

దేశంలోకి ఒమిక్రాన్‌ ఎంట్రీతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంటే.. కొంతమంది బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నారు. విదేశాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఓ యువతి అధికారుల కళ్లుకప్పి.. విమానాశ్రయం నుంచి పరారైంది. ఆమె అడ్రస్‌ను గుర్తించిన అధికారులు.. నేరుగా ఇంటికి వెళ్లి.. ఆమెను గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. యువతి తల్లిదండ్రులు ఐసోలేషన్‌లో ఉన్నారు.