Omicron India : ఇండియాలో ఒమిక్రాన్…2 వేల 135 కేసులు..828 మంది డిశ్చార్జ్

మహారాష్ట్ర 653 కేసులతో మొదటి స్థానంలో నిలవగా....ఢిల్లీ 464 కేసులతో రెండోస్థానంలో కొనసాగుతోంది. కేరళలో 185, రాజస్థాన్ లో 174...

Omicron India : ఇండియాలో ఒమిక్రాన్…2 వేల 135 కేసులు..828 మంది డిశ్చార్జ్

Omicron (3)

Omicron Cases In India : భారతదేశంలో ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. భారీగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 2 వేల 135 కేసులు సంఖ్య చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కొత్త వేరింట్ బారిన పడిన 828 మందిని డిశ్చార్జ్ చేయడం జరిగిందని పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్లో మొదటిస్థానంలో మహారాష్ట్ర 653 కేసులతో మొదటి స్థానంలో నిలవగా….ఢిల్లీ 464 కేసులతో రెండోస్థానంలో కొనసాగుతోంది. కేరళలో 185, రాజస్థాన్ లో 174, గుజరాత్ లో 154, తమిళనాడులో 121, తెలంగాణ రాష్ట్రంలో 84, కర్ణాటకలో 77, హర్యానా లో 71 , ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 31 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో 24, వెస్ట్ బెంగాల్ లో 20, మధ్యప్రదేశ్ లో 9, ఉత్తరాఖండ్ 8, గోవా లో 5 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది.

Read More : Omicron Kit : ఒమిక్రాన్‌ను గుర్తించే కిట్‌

మహారాష్ట్రలో 650కి పైగా ఒమిక్రాన్‌ కేసులుండగా.. ఒక్క ముంబైలోనే 4వందలకు పైగా నమోదయ్యాయి. ఆ తర్వాత పుణెలో 70కి పైగా ఒమిక్రాన్‌ కేసులున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. కరోనా కేసులు సునామీలా వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ముంబయి మేయర్‌ కిశోరి పెడ్నేకర్‌ అన్నారు. థర్డ్‌వేవ్‌కు సిద్ధంగానే ఉన్నామనీ.. లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లు, ఆస్పత్రులలో 30వేల పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. జంబో కొవిడ్‌ సెంటర్లు కూడా సిద్ధంగానే ఉన్నట్లు పేర్కొన్నారు.