Omicron Anti-bodies: బూస్టర్ డోసు కంటే ఓమిక్రాన్ సంక్రమణతో పెరిగిన రోగ నిరోధక శక్తి: పరిశోధకులు

కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ తీసుకున్న వారి కంటే..ఓమిక్రాన్ తిరిగి సంక్రమించిన వారిలో రోగ నిరోధక శక్తీ పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు.

Omicron Anti-bodies: బూస్టర్ డోసు కంటే ఓమిక్రాన్ సంక్రమణతో పెరిగిన రోగ నిరోధక శక్తి: పరిశోధకులు

Omi

Omicron Anti-bodies: ప్రపంచ వ్యక్తంగా ఇంకా కరోనా ప్రభావం కొనసాగుతుంది. అమెరికా, యూరోప్, ఆసియ ఖండాల్లోని పలు దేశాల్లో కరోనా కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్ రూపంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. మరోవైపు 2022 జూన్ చివరి నాటికి కరోనా నాలుగో దశ తారాస్థాయికి చేరుకుంటుందన్న నిపుణుల హెచ్చరికల మేరకు..పలు దేశాల్లో కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవాలని సూచిస్తున్నాయి. ఈక్రమంలో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు, ఓమిక్రాన్ సంక్రమణ పై జరిపిన పరిశోధనలు కీలక విషయాలు వెల్లడిస్తున్నాయి. కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ తీసుకున్న వారి కంటే..ఓమిక్రాన్ తిరిగి సంక్రమించిన వారిలో రోగ నిరోధక శక్తీ పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుని.. తిరిగి వైరస్ సంక్రమణకు గురైన వారిలో ఓమిక్రాన్ ప్రతిరోధకాలు (Antibodies) పెరిగి, వైరస్ కట్టడికి మరింత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

Other Stories:Bombay High Court : ‘పెదవులపై ముద్దులు పెట్టడం, ప్రైవేటు పార్టులను తాకటం లైంగిక నేరం కాదు’..

ఈమేరకు అధ్యయన తాలూకు నివేదికలను ‘బయోఆర్క్సివ్ సర్వర్‌’లోని ప్రచురించబడింది. ముందు తీసుకున్న పలు రకాల వ్యాక్సిన్‌ల కంటే ఓమిక్రాన్ సంక్రమణ సమయంలో తీసుకునే బూస్టర్ డోసు వలన బాధితులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. రెండు డోసులు తీసుకుని, తిరిగి ఓమిక్రాన్ భారిన పడిన కరోనా వైరస్ బాధితుల నాసికా శ్లేష్మంలో ప్రతిరోధకాలను పరిశోధకులు గుర్తించారు. ఇది వైరస్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే తటస్థీకరించింది. అయితే వ్యాక్సిన్ తీసుకోకుండా మొట్టమొదటిసారిగా ఓమిక్రాన్ సోకిన వారిలో ప్రతిస్పందన కనిపించడం లేదని పరిశోధకులు గుర్తించారు.

Other Stories:Kim Jong-un : ఉత్తరకొరియాలో మూడురోజుల్లో 8,20,000లకు పైగా కేసులు నమోదు..