Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ BA.5 తొలి కేసు నమోదు..తెలంగాణలో గుర్తింపు

దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో వ్యాప్తి చెందిన ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్లు బీఏ.4, బీఏ.5లు భారత్‌లో గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం స్పష్టం చేసింది.

Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ BA.5 తొలి కేసు నమోదు..తెలంగాణలో గుర్తింపు

Omicron Ba.5

Omicron sub variant BA.5 : కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచదేశాలను పట్టిపీడిస్తూనేవుంది. డేల్టా, డేల్టా ప్లస్, ఒమిక్రాన్ వంటి కొత్త కొత్త వేరియట్స్ రూపంలో మానవాళిపై దాడి చేస్తూ ప్రాణాలు హరిస్తోంది. దక్షిణాఫ్రికాతోపాటు పలు దేశాల్లో కరోనా కేసులు ఉధృతి కావడానికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.4 కారణమైంది. దేశంలో కరోనా కేసులు తగ్గినప్పటికీ.. వైరస్‌ ఇంకా ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. ఒమిక్రాన్‌ వేరియంట్లతో కల్లోలం సృష్టిస్తోంది.

తాజాగా మరికొన్ని ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు వెలుగులోకి వచ్చాయి. దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో వ్యాప్తి చెందిన ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్లు బీఏ.4, బీఏ.5లు భారత్‌లో గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం స్పష్టం చేసింది. తెలంగాణ, తమిళనాడులో ఈ కేసులు బయటపడినట్లు తెలిపింది. ఈ నెల 9న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో తొలి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.4ను గుర్తించారు. ఇండియన్ సార్స్ కోవ్-2 కన్షార్షియం ఆన్ జీనోమిక్స్ ఈ విషయాన్ని వెల్లడించింది.

Omicron : ఎలుకల నుంచి మనుషులకు ఒమిక్రాన్ వ్యాప్తి?

BA.4 మొదటి కేసును గుర్తించాక, దక్షిణాఫ్రికా నుండి హైదరాబాద్‌కు వచ్చిన వ్యక్తితో పరిచయం ఉన్న వారి కాంటాక్ట్ ట్రేసింగ్ ను ప్రారంభించామని అధికారులు చెబుతున్నారు. ఏ లక్షణాలు లేకపోయినా అతని నుంచి మే 9న సేకరించిన శాంపుల్స్‌లో విషయం బయటపడిందని న్యూస్ మీడియా పేర్కొంది. ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) మే 23న సోమవారం ఇదే కేసుపై బులెటిన్‌ను విడుదల చేసింది.

తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల యువతిలో ఒమిక్రాన్‌ బీఏ.4ను గుర్తించామని ఇన్సాకాగ్‌ పేర్కొంది. ఆ బాధితురాలికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఆమె వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకొన్నట్లు తెలిపింది. తెలంగాణలో 80 ఏళ్ల వృద్ధుడిలో బీఏ.5 బయటపడినట్లు స్పష్టం చేసింది. అతడిలోనూ స్వల్ప లక్షణాలే ఉన్నాయని, పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ చేయించుకున్నట్లు పేర్కొంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఇరువురు బాధితుల కాంట్రాక్ట్ ట్రేసింగ్‌ను చేపట్టినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Omicron sub variants: ఒమిక్రాన్ సబ్ వేరియంట్లతో వ్యాక్సిన్ తీసుకున్నా ముప్పు తప్పదా?.. శాస్త్రవేత్తలు ఏమన్నారంటే?

తమిళనాడు హెల్త్ మినిస్టర్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.4 నమోదైనట్లు సుబ్రమణియన్ కన్ఫామ్ చేశారు. మే21 శనివారం విడుదల చేసిన స్టేట్మెంట్ ప్రకారం ఇండియాలో ఇది రెండో కేసు. చెంగల్పట్టు జిల్లాలోని చెనైయాకు 30కిలోమీటర్ల దూరంలో ఉన్న నవాలూర్ గ్రామానికి చెందిన వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అయితే BA.4 వేరియంట్‌ను మొదటిసారిగా జనవరి 10, 2022న దక్షిణాఫ్రికాలో కనుగొన్నారు. అప్పటి నుండి, అన్ని దక్షిణాఫ్రికా ప్రావిన్సులలో ఒకొక్కటిగా బయటపడింది.