India Omicron : భారత్‌‌ను వణికస్తున్న ఒమిక్రాన్..ఎన్ని కేసులంటే

భారత్‌ను ఒమిక్రాన్‌ టెన్షన్‌ పెట్టేస్తోంది. దేశంలో సౌతాఫ్రికా వేరియంట్‌ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. దేశంలో...

India Omicron : భారత్‌‌ను వణికస్తున్న ఒమిక్రాన్..ఎన్ని కేసులంటే

Omicron Variant Cases In India Cases

Omicron Variant India : భారత్‌ను ఒమిక్రాన్‌ టెన్షన్‌ పెట్టేస్తోంది. దేశంలో సౌతాఫ్రికా వేరియంట్‌ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. దేశంలో 2021, డిసెంబర్ 15వ తేదీ బుధవారం ఒక్కరోజే 12 ఒమిక్రాన్ వేరియంట్ కేసులను గుర్తించారు. దీంతో దేశంలో మొత్తం 73 ఒమిక్రాన్ కేసులు రికార్డయ్యాయి. అటు రాష్ట్రాలను వేరియంట్‌ వణికిస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 32, రాజస్థాన్ లో 17, తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది.

Read More : TS Inter : తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం ఎదురు చూపులు..నేడు విడుదలయ్యేనా ?

ముఖ్యంగా మహారాష్ట్రను ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. మహారాష్ట్రను ఒమిక్రాన్‌ చుట్టేస్తోంది. అక్కడ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నాయి. కొత్తగా మరో నలుగురిలో ఈ కొత్త వేరియంట్‌ వెలుగుచూసింది. దీంతో ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య 32కి చేరింది. వారిలో కోలుకున్న 25 మందికి నెగెటివ్‌ రావడంతో డిశ్చార్జి అయ్యారు. తాజాగా బయటపడిన నాలుగు కేసుల్లో ఇద్దరు ఉస్మానాబాద్‌కు చెందినవారు కాగా.. ఒకరు ముంబై, మరొకరు బుల్దానాకు చెందినవారిగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు.

Read More : Electoral Reform Proposals : ఓటర్‌ ఐడీతో ఆధార్‌ లింక్.. కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌!

దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 73కి చేరింది. ఇటు ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. దేశంలోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు పౌర విమానయానశాఖ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు తప్పనిసరి చేసింది. ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చే వారంతా తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష కోసం ముందస్తు బుకింగ్‌ చేసుకోవాలని స్పష్టం చేసింది.